India- Vegetarian Population: మాంసాహారం కంటే శాఖాహారమే ఆరోగ్యానికి రక్షణ. పురాతన కాలంలో మన దేశంలో మాంసాహారమంటే తెలియదు. మాంసాహారం అలవాటు చేసిన వారు ఆంగ్లేయులే. టీ, కాఫీలు అలవాటు చేసిన వారు కూడా వారే కావడం గమనార్హం. ఇలా మనకు చెడు అలవాట్లను అలవాటు చేసి మంచి వాటిని మన నుంచి దూరం చేయడంలో వారిదే ఆధిపత్యం. అందుకే మనకు మాంసాహారం ఓ వ్యసనంలా మారింది. దీంతో దేశంలో మాంసాహారుల సంఖ్య పెరుగుతోంది. శాఖాహారుల సంఖ్య కూడా ఎక్కువే. ప్రపంచంలోనే అత్యధిక మంది శాఖాహారులున్న దేశంగా మనకు గుర్తింపు లభించడం విశేషం. మాంసాహారంతో అనర్థాలు వస్తాయని తెలిసినా వదలడం లేదు.

ప్రపంచంలోనే అత్యధిక మంది శాఖాహారులున్న దేశంగా మనదేశం గుర్తింపు పొందింది. హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అత్యధిక మంది శాఖాహారులే. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం మాంసాహారమే ప్రధానమైన ఆహారం. టాప్ 10 శాఖాహార దేశాల జాబితాలో మెక్సికో తరువాత మనదేశం ఉంది. ఇక్కడ 19 శాతం మంది శాఖాహారులున్నారు. నాన్ వెజ్ తినడంలో మహిళలు కూడా వెనుకంజ వేయడం లేదు. ప్రతి నలుగురిలో ముగ్గురు మంది మహిళలు మాంసాహారమే తింటున్నారని సర్వేలు తెలియజేస్తున్నాయి. వారిలో ఎక్కువ శాతం మంది తూర్పు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారే ఉన్నారు.
దేశంలో అత్యధిక మంది శాఖాహారులు ఉత్తర, మధ్య భారతదేశంలో ఉన్నారు. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, చత్తీస్ గడ్, హిమాచల్ ప్రదేశ్ ఉత్తర, మధ్య భారతదేశంలో శాఖాహారులున్నట్లు చెబుతున్నారు. తూర్పు రాష్ట్రాల్లో 90 శాతం మంది మాంసాహారులున్నారు. పశ్చిమబెంగాల్, ఒడిశా, బిహార్ రాష్ట్రాల్లో మాంసాన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు దీంతో మన దేశం అటు మాంసాహారులు, ఇటు శాఖాహారులు ఉన్నదేశంగా గుర్తింపు పొందుతోంది. నాన్ వెజ్ కంటే వెజ్ బెటరే. కానీ ఎవరు మాత్రం పట్టించుకుంటున్నారు.

నాన్ వెజ్ తింటే ఎక్కువ శాతం మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్, గుండెపోటు తదితర వ్యాధులు వస్తాయని తెలిసినా ఎవరు మానడం లేదు. ఫలితంగా మాంసాహారమే ప్రధానమైపోతోంది. పండుగలకైతే లెక్కలేదు. అందరి ఇళ్లల్లో మటన్, చికెన్ లే దర్శనమిస్తున్నాయి. దీంతో జిహ్వ చాపల్యం చంపుకోవడం లేదు. నాలుకకు రుచి కోసం శరీరాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఫలితంగా పలు రోగాలకు దగ్గరవుతున్నారు. ఆరోగ్యాన్ని చేజేతులా హరించుకుంటున్నారు. వ్యాధులతోనే సహవాసం చేస్తున్నారు.