Bigg Boss 6 Telugu Arohi Elimination: బిగ్ బాస్ సీజన్ 6లో కాస్తా అగ్రెసివ్ గా ఆడేది ఎవరయ్యా అంటే మొన్నటివారం వరకూ నేహా.. ఈ వారం వరకూ ‘ఆరోహి’.. కానీ వరుసగా వీరిని ఎలిమినేట్ చేసిపడేశారు. అసలు హౌస్ లోనే స్ట్రాంగ్ కంటెస్టెంట్ లు అయిన వారిని ఎందుకు ఎలిమినేట్ చేస్తున్నారు? నిజంగానే జనాల ఓట్ల ప్రకారం చేస్తున్నారా? లేక బిగ్ బాస్ గేమ్ ఏంటన్నది అంతుపట్టకుండా ఉంది. ఈవారం ఎలిమినేట్ అయిన ఆరోహి చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆమె తనను తాను డిఫెన్స్ చేసుకునే విధానం.. గేమ్స్, టాస్క్ లు, నామినేషన్ లలో పురుష కంటెస్టెంట్లతోనూ సై అంటే సై అనేలా క్లియర్ కట్ గా మెప్పించేలా వాదించే విధానం అందరినీ ఆకట్టుకుంటోంది. కానీ అంత బలమైన కంటెస్టెంట్ ను బయటకు ఎందుకు పంపారో బిగ్ బాస్ నిర్వాహకులకు కూడా అర్థం కాని పరిస్థితి.

ఆరోహితోపాటు చివరి ఎలిమినేషన్ లో ఉన్న ‘సుదీప’ అసలు ఏం చేయకుండా కామ్ గా ఉంటూ పెద్ద ముత్తైదువులా ప్రవర్తిస్తోంది. ఈమె కంటే ఆరోహి నూరు పాళ్లు నయం. అయినా కూడా ఎలిమినేట్ చేయడం చూసి అంతా షాక్ అవుతున్న పరిస్థితి. పోయిన వారం కూడా గేమ్ ను అగ్రెసివ్ గా ఆడిన నేహాను ఇంటికి పంపించారు. దీనివల్ల బాగా ఆడినా.. నోరుతో వాగినా ఎలిమినేట్ అయిపోతామన్న భయం కంటెస్టెంట్లను వెంటాడుతోంది. అందుకే అందరూ సైలెంట్ అవుతున్నారు. ఈ పరిణామం బిగ్ బాస్ షోపై పడి రేటింగ్ పడిపోతోంది.
ఇప్పటికే నాగార్జున హౌస్ లో అస్సలు కంటెంట్ ఇవ్వకుండా సైలెంట్ గా ఉంటున్న షానీ, అభినయశ్రీలను బాగా ఆడడం లేదంటూ ఎలిమినేట్ చేశాడు. ఇక బాగా ఆడిన ఆరోహి, నేహాలను కూడా పంపుతున్నాడంటే బిగ్ బాస్ కంటెస్టెంట్లకు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నాడో అర్థం కాని పరిస్థితి.
నిజానికి ఆరోహి.. ఇటు హౌస్ లోని తోటి మేల్ కంటెస్టెంట్ సూర్యతో రోమాంటిక్ గా ఉంటోంది. అతడితో ముద్దులు, మురిపాలు, అలకలతో కావాల్సిన కంటెంట్ ఇస్తోంది. ప్రేక్షకులకు మంచి వినోదం పంచుతోంది. ఇక హౌస్ లోని అమ్మాయిలందరికీ కంటే కూడా బాగా ఆడుతూ టాస్క్ లలో రెచ్చిపోతోంది. మగ కంటెస్టెంట్లతోనూ గట్టిగా పోరాడుతోంది. ఆమె వాదన కరెక్ట్ గా చేస్తూ ఇతర సభ్యులదే తప్పు అన్నట్టుగా ఫోకస్ చేస్తోంది. అలాంటి ఆరోహిని బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసిందా? లేక నిజంగానే చూస్తున్న ప్రేక్షకులు ఎలిమినేట్ చేస్తున్నారా? అన్నది తెలియకుండా ఉంది. ఇదంతా బిగ్ బాస్ ఆడుతున్న గేమ్ నా? అన్నది సందేహాస్పదంగా ఉంది.

గతంలో హౌస్ లో బాగా గొడవలు పెట్టుకొని.. టాస్క్ లు బాగా ఆడేవారిని తక్కువ ఓట్లు వచ్చినా బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేసేది కాదు.. ఆ వారం ఎలిమినేషన్ రద్దు చేయడమో.. లేక బాగా ఆడని వారిని ఎలిమినేట్ చేయడమో చేసేదన్న విమర్శ ఉంది. కానీ ఇంత బాగా ఆడుతున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆరోహి ఎలిమినేసన్ వెనుక మాత్రం అందరిలోనూ అనుమానాలున్నాయి..
అయితే ఆరోహి అంటే బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు ఎవరికీ తెలియదని.. ఆమె ముక్కు మొహం కూడా ఇదివరకూ ప్రేక్షకులకు పరిచయం లేదని. . అందుకే తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. ఈమె దూకుడు ఆటతీరు కూడా మైనస్ గా మారి ఓట్లు రాబట్టుకోలేకపోయిందని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇలా ఎలిమినేట్ కావడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది.
Also Read:Stopped Cricket Matches: క్రికెట్ మ్యాచ్ లను ఆపేసిన కొన్ని వింత కారణాలు
[…] Also Read: Bigg Boss 6 Telugu Arohi Elimination: స్ట్రాంగ్ కంటెస్టెంట్ … […]
[…] Also Read: Bigg Boss 6 Telugu Arohi Elimination: స్ట్రాంగ్ కంటెస్టెంట్ … […]