Homeజాతీయ వార్తలుIndia Global Power: ఇండియా అంటే ట్రంప్‌ కే కాదు.. అభివృద్ధి చెందిన దేశాలన్నిటికి వణుకు...

India Global Power: ఇండియా అంటే ట్రంప్‌ కే కాదు.. అభివృద్ధి చెందిన దేశాలన్నిటికి వణుకు అందుకే!

India Global Power: భారత్‌.. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి. జీడీపీ పరంగా ఇండియా ప్రస్తుతం ఐదో స్థానానికి చేరింది. పదేళ్లలో ఐదు స్థానాలు ఎగబాకింది. ఇటీవలే జపాన్‌ను కూడా వెనక్కు నెట్టి నాలుగో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించింది. 4.19 ట్రిలియన్‌ డాలర్ల నామినల్‌ జీడీపీతో ఈ స్థానం సంపాదించింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనాల ప్రకారం, 2028 నాటికి భారతదేశం జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ఈ ఎదుగుదలే ప్రపంచ దేశాలకు కటగింపుగా మారింది. భారత్‌ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నాయి. అమెరికాకు అయితే మన ఎదుగుదల అస్సలు మింగుడు పడడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే అమెరికాలో భారత్‌అంటే వణుకు మొదలైంది.

Also Read: డ్రోన్‌ బెటాలియన్‌.. భారత ఆర్మీ మరింత పవర్‌ఫుల్‌!

ప్రపంచ జిడిపి ర్యాంకింగ్స్‌ ఇలా..
ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో యునైటెడ్‌ స్టేట్స్‌ 30.51 ట్రిలియన్‌ డాలర్ల జీడీపీతో మొదటి స్థానంలో ఉంది, ఆ తర్వాత చైనా 19.23 ట్రిలియన్‌ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది. జర్మనీ (4.74 ట్రిలియన్‌ డాలర్లు), భారతదేశం (4.19 ట్రిలియన్‌ డాలర్లు), జపాన్‌ (4.19 ట్రిలియన్‌ డాలర్లు) తదుపరి స్థానాల్లో ఉన్నాయి. యూకే 3.84 ట్రిలియన్‌ డాలర్లు, ఫ్రాన్స్‌ 3.21 ట్రిలియన్‌ డాలర్లు, ఇటలీ 2.42 ట్రిలియన్‌ డాలర్లు, కెనడా 2.23 ట్రిలియన్‌ డాలర్లు, బ్రెజిల్‌ 2.13 ట్రిలియన్‌ డాలర్లతో తర్వాతి ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ ర్యాంకింగ్‌లు దేశాల ఆర్థిక బలాన్ని, వృద్ధి సామర్థ్యాన్ని సూచిస్తాయి.

నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌..
2025లో భారతదేశం 4 ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థగా జపాన్‌తో సమానంగా నాల్గవ స్థానంలో నిలిచింది. వ్యవసాయం, టెక్నాలజీ సేవలు, చేనేత పరిశ్రమ, వ్యాపార ఔట్‌సోర్సింగ్‌ వంటి రంగాలు భారతదేశ ఆర్థిక ప్రగతికి దోహదపడ్డాయి. ఐఎంఎఫ్‌ అంచనాల ప్రకారం, 2024–25, 2025–26లో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు 6.2%గా ఉంటుంది, ఇది ప్రపంచంలోని ప్రముఖ ఆర్థిక వ్యవస్థలలో అత్యంత వేగవంతమైంది.
ఇదిలా ఉంటే.. భారతదేశం నాల్గవ స్థానంలో ఉన్నప్పటికీ, తలసరి ఆదాయం 2,880 డాలర్లు (సుమారు రూ. 2.4 లక్షలు)గా ఉంది, ఇది జపాన్‌ (33,960 డాలర్లు)తో పోలిస్తే గణనీయంగా తక్కువ. అయితే, గత దశాబ్దంలో తలసరి ఆదాయం 188% పెరిగింది, 2015లో రూ. 86,647 నుంచి 2025లో రూ. 2.4 లక్షలకు చేరుకుంది. జనాభా వృద్ధి, ఉపాధి డిమాండ్, ఆర్థిక సంస్కరణలు ఈ పెరుగుదలకు దోహదపడ్డాయి.

దశాబ్దంలో భారతదేశ జీడీపీ వృద్ధి ఇలా..
గత 10 సంవత్సరాలలో భారతదేశ జీడీపీ వృద్ధి రేటు హెచ్చుతగ్గులను చవిచూసింది. 2020లో కోవిడ్‌ మహమ్మారి సమయంలో –6.6% వృద్ధి రేటు నమోదైనప్పటికీ, 2021లో 8.68%కి గణనీయంగా పుంజుకుంది. 2023, 2024లో 8.2% వృద్ధి రేటుతో భారతదేశం ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థలలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలిచింది.

– 2013: 6.39%
– 2014: 7.41%
– 2015: 8.00%
– 2016: 8.26%
– 2017: 6.80%
– 2018: 6.45%
– 2019: 3.74%
– 2020: –6.60%
– 2021: 8.68%
– 2022: 7.00%
– 2023: 8.20%
– 2024: 8.20%
వృద్ధి రేటు నమోదైంది.

5 ట్రిలియన్‌ డాలర్ల టార్గెట్‌..
భారతదేశం 2027 నాటికి ు5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2028 నాటికి జర్మనీని అధిగమించి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది. ప్రభుత్వ సంస్కరణలు, శ్రామిక, వ్యాపార సౌలభ్యం, పెరుగుతున్న వినియోగం, పెట్టుబడులు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Also Read: అత్యంత ఎత్తులో కాశ్మీర్ లో ఎయిర్ ఫీల్డ్.. ఇక చైనాకు దబిడ దిబిడే..

అగ్రదేశాల్లో భయం..
భారత దేశ అభివృద్ధి వేగం.. ఇప్పుడు ప్రపంచంలోని సంపన్న దేశాలకు మింగుడు పడడం లేదు. అందుకే మనను తొక్కేయాలని చూస్తున్నాయ. రష్యా ఒక్కటే మనకు మద్దతుగా నిలుస్తోంది. ఇక అమెరికాకు నంబర్‌ స్థానానికి ముప్పు వస్తుందనే భయం నెలకొంది. అందుకే డొనాల్డ్‌ ట్రంప్‌ ఇప్పుడు భారత్‌ను చూసి జంకుతున్నారు. ఈ క్రమంలోనే మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా టారిఫ్‌లు విధిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular