Homeజాతీయ వార్తలుIndian Family Near US Border: చలికి గడ్డకట్టి అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం.....

Indian Family Near US Border: చలికి గడ్డకట్టి అమెరికా సరిహద్దులో భారత కుటుంబం దుర్మరణం.. మృతుల్లో చిన్నారి

Indian Family Near US Border: అమెరికాలో ఓ భారతీయ కుటుంబం విగతజీవులుగా మారింది. చలికి గట్టకట్టుకుపోయి అత్యంత దారుణంగా ప్రాణాలు కోల్పోయింది. అయితే ఈ కుటుంబం అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు సిద్ధపడిందని తెలుస్తోంది. అమెరికా-కెనడా సరిహద్దులో చలికి తట్టుకోలేక ప్రాణాలు విడిచిందని తెలుస్తోంది. గుజరాత్ కు చెందిన జగదీష్ బల్ దేవ్ భాయి పటేల్ కుటుంబం ఈనెల 19న విషాదాంతమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఇందులో జగదీష్ బల్ దేవ్ భాయ్ పటేల్ (39), వైశాలి బెన్ (37), కుమార్తె విహంగి (11), కుమారుడు ధార్మి(03) ఉన్నట్లు తెలుస్తోంది.

Indian Family Near US Border
Indian Family Near US Border

కెనడా నుంచి అమెరికాకు అక్రమ వలసలు పెరిగిన క్రమంలో అమెరికా అధికారులు నిఘా కట్టుదిట్టం చేశారు.దీంతో సరిహద్దులో అమెరికా సైనికులకు కెనడా వైపు నాలుగు మృతదేహాలు కనిపించాయి. అయితే అవి అత్యంత దారుణమైన స్థితిలో కుళ్లిపోయి కనిపించాయి. దీంతో అధికారులు వాటిని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తరువాత వివరాలు సేకరించారు.

Also Read: ఇదేం చోద్యం.. కిరాణా, సూపర్ మార్కెట్లలో వైన్ అమ్మకం.. రైతుల మేలు కోసమే అన్న ఉద్ధవ్ సర్కార్!

చలికి తట్టుకోలేకే ఈ కుటుంబం మృతిచెందినట్లు గుర్తించారు. ఇక్కడకు చేరుకునే ముందు ఈ కుటుంబం కొద్ది రోజులు కెనడాలో తిరిగినట్లు కనుగొన్నారు. పటేల్ కుటుంబం జనవరి 12న టొరంటో చేరుకుందని తెలుస్తోంది. అక్కడి నుంచి వీరు సరిహద్దుకు 18న వచ్చినట్లు తెలుసుకున్నారు. అయితే వీరిని మానవ అక్రమ రవాణా ముఠా ఇక్కడకు పంపించి ఉంటుందని అనుమానిస్తున్నారు.

అయితే ఎవరో వీరిని వాహనంలో తీసుకొచ్చారని చెబుతున్నారు. సరిహద్దు దగ్గర ఎలాంటి వాహనాలు కనిపించలేదు. దీంతో ఇది అక్రమ మానవ రవాణా ముఠా పని అని చెబుతున్నారు. మొత్తానికి ఓ భారత కుటుంబం అగ్రరాజ్యంలో అసువులు బాయడం విషాదం నింపుతోంది. పటేల్ కుటుంబం మృతిని భారత హైకమిషనర్ వెల్లడించింది. మృతదేహాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.

Also Read: కడపోళ్లకు చంపేయ‌డ‌మే వొచ్చు.. సోము వీర్రాజు వివాదాస్ప‌ద వ్యాఖ్యలు..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

1 COMMENT

  1. […] Bollywood Crazy Updates: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ బాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం సినిమాల కంటే ఆయన చేస్తున్న చేష్టలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. వర్మ తరచూ ఏదో ఒక అంశంతో వివాదాల్లో నిలుస్తున్నారు. అంతే కాకుండా పబ్బుల్లో హీరోయిన్లతో డ్యాన్సులు చేస్తున్న వీడియోలను షేర్ చేస్తూ సంచలనాలు రేపుతున్నాడు. రీసెంట్‌గా టాలీవుడ్‌కు చెందిన ఓ నటితో వర్మ చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియో పై నెటిజన్లు మండిపడుతున్నారు. […]

Comments are closed.

Exit mobile version