https://oktelugu.com/

BJP Vs TRS: బెంగాల్ తరహా రాజకీయం.. గప్ చుప్ గా పని కానిచ్చేస్తున్న బీజేపీ, టీఆర్ఎస్..!

BJP Vs TRS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే గతంలో సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని సాధించారు. ఈక్రమంలోనే ఈసారి కూడా టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టి షాక్ తగిలిన […]

Written By:
  • NARESH
  • , Updated On : January 28, 2022 / 04:52 PM IST
    Follow us on

    BJP Vs TRS: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. అయితే గతంలో సీఎం కేసీఆర్ ఎవరూ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లి బంపర్ విక్టరీని సాధించారు. ఈక్రమంలోనే ఈసారి కూడా టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

    గత కొద్దిరోజులుగా సీఎం కేసీఆర్ వేస్తున్న అడుగులు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. హూజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గట్టి షాక్ తగిలిన తర్వాత నుంచి సీఎం కేసీఆర్ అలర్ట్ అయ్యారు. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంలోని బీజేపీని టీఆర్ఎస్ కార్నర్ చేసింది. దీంతో ఇరుపార్టీల మధ్య మాటల యుద్దానికి తెరలేచింది.

    రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే టీఆర్ఎస్, బీజేపీ వ్యూహ ప్రతీవ్యూహాలు రచిస్తున్నాయి. టీఆర్ఎస్ కు తెలంగాణలో తామే ప్రత్యామ్నాయం అని బీజేపీ భావిస్తోంది. దీంతో టీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల దృష్టిని తమవైపు మలుచుకునే పడింది. ఇదే సమయంలో గవర్నర్ తమిళ సై సైతం టీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా పావులు కదుతుండటం ఆసక్తిని రేపుతోంది.

    దీంతో సీఎం కేసీఆర్ కొద్దిరోజులుగా గవర్నర్ తో అంటిముంటనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల రాజ్ భవన్లో జరిగిన రిపబ్లిక్ వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన లేదని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో గవర్నర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటంతోనే పరేడ్‌ గ్రౌండ్‌ లేదా పబ్లిక్‌ గార్డెన్‌లో నిర్వహించాల్సిన గణతంత్ర దినోత్సవాన్ని ఈసారి రాజ్‌భవన్‌కే పరిమితం చేశారు.

    ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొనలేదు. సాధారణంగా ఇలాంటి కార్యక్రమంలో రాష్ట్ర ప్రగతిపై ప్రభుత్వం అందించిన గణాంకాలనే గవర్నర్‌ చదువుతుంటారు. అయితే ఈసారి అలా జరగలేదు. పైగా గవర్నర్‌ తన ప్రసంగంలో ప్రధానమంత్రి మోదీని రెండుసార్లు ప్రశంసించారు. గవర్నర్‌ తమిళిసై ఇటీవల తెలంగాణ ప్రగతి గురించి ఎక్కడా మాట్లాడం లేదు కేవలం కేంద్రం గురించి మాత్రమే చెబుతున్నారు.

    ఇటీవల గణతంత్ర దినోత్సవం నాడు గవర్నర్‌ చదివిన ప్రసంగాన్ని క్యాబినెట్‌ ఆమోదించలేదని తెలుస్తోంది. ఆ స్పీచ్ కాపీనే ఆమెనే స్వయంగా రాసుకున్నారని సమాచారం. మరోవైపు ఇటీవల ప్రధాని మోదీ ఇటీవల కొవిడ్‌పై అన్ని రాష్ట్రాల సీఎంలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు సీఎం కేసీఆర్‌ డుమ్మా కొట్టారు. ఇప్పుడు గణతంత్ర దినోత్సవానికీ గైర్హాజరు అయ్యారు.

    సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే బీజేపీ నేతలు, ఆ పార్టీ నియమించిన గవర్నర్‌తో దూరంగా ఉంటున్నారనే టాక్ నడుస్తోంది. వీరిమధ్య ఈ దూరం ఇలానే పెరిగితే బీజేపీయేతర రాష్ట్రాల్లో గవర్నర్లు ఎలా యాక్టివ్ అయ్యారో తెలంగాణలోనూ తమిళిసై కూడా యాక్టివ్ అయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక జరిగితే తెలంగాణలో రాజకీయాల్లో బెంగాల్ రాజకీయాలను తలపించడం ఖాయంగా కన్పిస్తోంది.