AP Govt Decision On New Districts: పరిపాలనా వికేంద్రీకరణ కోసం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నూతన జిల్లాల ఏర్పాటు నిర్ణయం ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా ఉంది. అయితే, ఈ నూతన జిల్లాల ఏర్పాటుతో రాష్ట్ర స్వరూపం అయితే మారిపోయింది. ఇప్పటి వరకు పెద్ద, చిన్న జిల్లాలుగా ఉన్న జిల్లాల స్వరూపాలు పూర్తిగా మారిపోయాయి. పెద్ద జిల్లాగా ఉన్న గుంటూరు కాస్తా ఇప్పుడు మూడు జిల్లాలు అయింది. గుంటూరు, బాపట్ల, పల్నాడుగా గుంటూరు మూడు జిల్లాలుగా విడిపోయింది. ఇక తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ కూడా మూడు జిల్లాలుగా అనగా తూర్పుగోదావరి, రాజమహేం ద్రవరం, కోనసీమగా ఏర్పడ్డాయి. అలా ఆయా జిల్లాల స్వరూపం, జనాభా విస్తీర్ణం అన్నిటిలోనూ మార్పులు జరిగాయి. ఆ ఎఫెక్ట్‌తో డిస్ట్రిక్ట్స్ మౌలిక స్వరూపం టోటల్ గా చేంజ్ అయిపోయినట్లే ఉందని కామెంట్స్ చేస్తున్నారు కొందరు.
ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త జిల్లాల ద్వారా సమీకరణాలు కొంత మేరకు మారుతాయని కొందరు పరిశీలకులు వివరిస్తున్నారు. కచ్చితంగా ఈ జిల్లాల విభజన ప్రభావం ఎన్నికలపైన పడుతుందని చెప్తున్నారు. గతంలో సామాజిక వర్గాల సమీకరణాలకు ఇప్పటి నూతన జిల్లాల సామాజిక వర్గాల సమీకరణాలకు కంపల్సరీగా తేడా ఉంటుందని అంటున్నారు. అయితే, అధికారంలో ఉన్న వైసీపీకి ఇది టెంపరరీగా యూజ్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
Also Read: AP New Districts: కొత్త జిల్లాలతో ఏపీ సర్కారుకు తలనొప్పులు.. అలా జరిగితే తెలంగాణ లాగే ఇబ్బందులు?
కాగా, ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా వీటిని సమన్వయం చేసుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్లు వాళ్లు కూడా మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న జిల్లాలు మారిపోయాయి. దాంతో ఆటోమేటిక్‌గా ప్రజలు తమ జిల్లా కేంద్రం దగ్గరలోకి వెళ్లిపోతుంటారు. ఈ నేపథ్యంలో వారి సమీకరణకు మళ్లీ ప్లాన్స్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త జిల్లాల ప్రకారం.. భౌగోళిక విస్తీర్ణంలో ఒంగోలు జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది.
రెండో స్థానంలో అల్లూరి సీతారామ రాజు జిల్లా ఉంటుంది. ఇంతకు ముందు ఏపీలోనే అతిపెద్ద జిల్లాగా ఉన్న అనంతపురం ఇప్పుడు మూడో స్థానానికి వచ్చేసింది. అలా పూర్వపు జిల్లా స్వరూపాలు అన్ని కూడా ఇప్పుడు మొత్తంగా మారిపోయాయని చెప్పొచ్చు. ఇలా ఈ మార్పులు చేయడం ద్వారా తమకు రాజకీయంగా లాభం జరుగుతుందని అధికార వైసీపీ భావించి ఉండొచ్చనే అభిప్రాయం కూడా ఉంది.
Also Read: AP New Districts: ఆ జిల్లాలోకి వెళ్లం.. విభజన తీరుపై మొదలైన లొల్లి