https://oktelugu.com/

చైనా దారుణం.. మోడీ మౌనం దేనికి సంకేతం?

భారతదేశం మీద పడి ఆ చైనా వాడు బతికేస్తున్నాడు. చైనీస్ యాప్ లతో మన డేటా కొల్లగొట్టేస్తున్నాడన్న ప్రచారమూ ఉంది. ఇక పెద్ద ఎత్తున వస్తుసామాగ్రిని దించి దేశంలో కుటీర పరిశ్రమను దెబ్బతీసి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న మనపై ఆధారపడి బతుకుతున్న చైనావాడు పాకిస్తాన్ తో కలిసి కుట్రలు చేస్తున్నాడు. తాజాగా మన 20మంది సైనికులను చంపాడు. అయినా భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి స్పందన లేదని తాజాగా కాంగ్రెస్ నేత […]

Written By:
  • NARESH
  • , Updated On : June 17, 2020 11:39 am
    Follow us on


    భారతదేశం మీద పడి ఆ చైనా వాడు బతికేస్తున్నాడు. చైనీస్ యాప్ లతో మన డేటా కొల్లగొట్టేస్తున్నాడన్న ప్రచారమూ ఉంది. ఇక పెద్ద ఎత్తున వస్తుసామాగ్రిని దించి దేశంలో కుటీర పరిశ్రమను దెబ్బతీసి సొమ్ము చేసుకుంటున్నాడు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద జనాభా ఉన్న మనపై ఆధారపడి బతుకుతున్న చైనావాడు పాకిస్తాన్ తో కలిసి కుట్రలు చేస్తున్నాడు. తాజాగా మన 20మంది సైనికులను చంపాడు. అయినా భారత ప్రధాని నరేంద్రమోడీ నుంచి స్పందన లేదని తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలతో కడిగేశారు..

    నిజమే ప్రధాని మోడీ చైనా విషయంలో మౌనం దాల్చారు. ఏ విషయం చెప్పడం లేదు. అధికారం చేతిలో ఉంది. చైనా వస్తువులు,దిగుమతులపై నిషేధం విధించవచ్చు. అమెరికాతో కలిసి చైనా దేశంపై ఒత్తిడి తేవచ్చు. సైన్యాన్ని సరిహద్దుల్లో దించి చైనా ముందరికాళ్లకు బంధం వేయొచ్చు. కానీ నిస్సహాయుడిగా చూస్తున్న మోడీ తీరుపై దేశ ప్రజల్లో సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

    కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తాజాగా ట్విట్టర్ లో హాట్ ప్రశ్న సంధించారు. ‘ఎందుకు మోడీ సైలెంట్ గా ఉంటున్నారు?.. ఎందుకు దాస్తున్నారు? అయిపోయేందేదో అయిపోయింది.. ఇప్పుడు ఏం చేయాలో చేయండి.. చెప్పండి.. మన సైనికులను చంపే ధైర్యానికి చైనా దిగింది. మన భూమిని లాక్కోంటోంది?’ మౌనం వీడండి అంటూ రాహుల్ గాంధీ సూటిగా ప్రశ్నించారు. మోడీ మౌనం దేశానికి మంచిది కాదని..చైనాకు బుద్ది చెప్పాల్సిందేనని రాహుల్ ప్రశ్నించాడు.

    అది రాహుల్ గాంధీ ఒక్కడి ప్రశ్నే కాదు.. దేశ ప్రజలందరి ప్రశ్న. సరిహద్దుల్లో 20 మందిని చంపిన చైనా వాడిపై బదులు తీర్చుకోవాలని ఇప్పటికే సోషల్ మీడియా నెటిజన్లు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. చైనా వస్తువులను నిషేధించాలని.. ఎవరూ వాడవద్దని.. చైనా యాప్ లను అందరూ డిలేట్ చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.

    ఇలా దేశప్రజల్లో భారత సైనికుల మృతితో సెంటిమెంట్ ఎక్కువైపోయింది. ఇంతటి క్లిష్ట సమయంలో మోడీ లాంటి కరుడుగట్టిన జాతీయ వాది మౌనంగా ఉండడమే దేశ ప్రజలను బాధిస్తోంది. చైనాపై ధీటుగా స్పందించాలన్న కసి దేశంలో పెరిగిపోతోంది. పాకిస్తాన్ కు బుద్దిచెప్పినట్టే చైనా పని కూడా పట్టాలని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారు. చూడాలి మరీ మన మోడీ సార్ ఏం చేస్తారో..

    -నరేశ్ ఎన్నం