https://oktelugu.com/

కాంగ్రెస్ నేతల ‘కొంప’ ముంచిన రేవంత్ రెడ్డి..!

కేటీఆర్ ఫాంహౌజ్ ఇష్యూపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా పోరాడుతున్నారు. 111జీవో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌజ్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ గ్రీన్ ట్రీబ్యూనల్ ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. రేవంత్ ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. తనకు గ్రీన్ ట్రీట్యూనల్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ వాదనలు విన్న కోర్టు స్టే విధించింది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 17, 2020 11:55 am
    Follow us on


    కేటీఆర్ ఫాంహౌజ్ ఇష్యూపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి గత కొంతకాలంగా పోరాడుతున్నారు. 111జీవో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి కేటీఆర్ అక్రమంగా ఫాంహౌజ్ నిర్మించారని ఆరోపిస్తూ రేవంత్ గ్రీన్ ట్రీబ్యూనల్ ను ఆశ్రయించిన సంగతి తెల్సిందే. రేవంత్ ఫిర్యాదు మేరకు గ్రీన్ ట్రీబ్యూనల్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేసింది. తనకు గ్రీన్ ట్రీట్యూనల్ నోటీసులు జారీ చేయడంపై మంత్రి కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. కేటీఆర్ వాదనలు విన్న కోర్టు స్టే విధించింది. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు అప్పట్లో ఎదురుదాడికి దిగారు. అయితే కొద్దిరోజులుగా టీఆర్ఎస్ నేతలు సైలంట్ కావడం రాజకీయ వర్గాల్లో టాపిక్ గా మారింది.

    కేటీఆర్ ఫాంహౌజ్ ఇష్యూలో రేవంత్ రెడ్డి తాజాగా ఆరోపణలు చేస్తున్నా టీఆర్ఎస్ నేతలు స్పందించడం లేదు. ఈ పరిణామంతో కాంగ్రెస్ నేతలు ఖంగుతింటున్నారు. హైదరాబాద్లో 111జీవోపై కాంగ్రెస్ నేతలే ఎక్కువగా ఇళ్లు నిర్మించుకున్నారని టీఆర్ఎస్ నేతలు గుర్తించారట. టీఆర్ఎస్ సర్కార్ కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీచేసి కూల్చివేయాలని ప్రయత్నిస్తుందనే టాక్ విన్పిస్తోంది. దీంతో 111 జీవో పరిధిలో ఇళ్లు నిర్మించుకున్న కాంగ్రెస్ నేతలు హడలిపోతున్నారు. 111జీవోలో అక్రమంగా నిర్మించుకున్న కేటీఆర్ ను ఇరుకున పెట్టాలని భావిస్తే అదికాస్తా తమ కొంపలను కూల్చేలా ఉందని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారట.

    రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు లేనట్టు రేవంత్ రెడ్డి 111జీవోలో కేటీఆర్ ఫాంహౌజ్ పై పోరాటం చేయడం వల్లే ఇదంతా జరిగిందని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారట. కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూతో టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నేతల ఇళ్లను కూల్చేందుకు ప్లాన్ చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేతలు అనుమానిస్తున్నారట. రేవంత్ చేసిన పనికి తమ ఇళ్లు ధ్వంసమయ్యేలా ఉన్నాయని ఆయనపై కాంగ్రెస్ నేతలు కారాలుమిరియాలు నూరుతోన్నారు. కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూలో కాంగ్రెస్ నేతల ఇళ్లు ఉండటంతో ఇది చివరకు కాంగ్రెస్ కే బూమరాంగ్ అయ్యేలా కన్పిస్తోంది. దీంతో ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డిని గమ్మున ఉండమని కాంగ్రెస్ నేతలు కోరుతున్నారట. అయితే దీనిపై రేవంత్ రెడ్డి తగ్గేది లేదనే సంకేతాలను ఆ పార్టీ నేతలకు ఇస్తుండటంతో 111జీవోలో భవనాలు నిర్మించుకున్న కాంగ్రెస్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయట. కేటీఆర్ ఫౌంహౌజ్ ఇష్యూ చివరికీ ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే..!