ఈ వారం యావరేజ్ కేసులు 5వేలు?

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం యావరేజ్ కేసుల సంఖ్య 4వేలు ఉండగా ఈ వారం 5వేలు గా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా కరోనా కేసులు 5వేలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 5611గా ఉన్న‌ది. ఈ వారం మొత్తం రోజుకి సరాసరి కేసుల సంఖ్య 5వేలు దాటే అవకాశాలు లేకపోలేదు. అంతే కాకుండా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. గత 24 […]

Written By: Neelambaram, Updated On : May 20, 2020 10:18 am
Follow us on

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. గత వారం యావరేజ్ కేసుల సంఖ్య 4వేలు ఉండగా ఈ వారం 5వేలు గా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సోమవారం ఒక్కరోజే కొత్తగా కరోనా కేసులు 5వేలు దాటాయి. గ‌త 24 గంట‌ల్లో దేశంలో వైర‌స్ సంక్ర‌మించిన వారి సంఖ్య 5611గా ఉన్న‌ది. ఈ వారం మొత్తం రోజుకి సరాసరి కేసుల సంఖ్య 5వేలు దాటే అవకాశాలు లేకపోలేదు. అంతే కాకుండా మృతుల సంఖ్య కూడా పెరుగుతుంది. గత 24 గంటల్లో 140 మంది వైర‌స్ వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు.

ఇక   దేశ‌వ్యాప్తంగా మొత్తం వైర‌స్ పాజిటివ్ కేసుల సంఖ్య 106750గా న‌మోదు అయింది.  దేశ‌వ్యాప్తంగా 61,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం మ‌ర‌ణించిన వారి సంఖ్య 3303గా రికార్డు అయ్యింది.  కేంద్ర ఆరోగ్య‌, సంక్షేమ శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.

తెలంగాణ‌లో కొత్తగా 42 కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1634కు చేరుకున్న‌ది.  దీంట్లో 1011 మంది కోలుకున్నారు.  585 కేసులు యాక్టివ్‌ గా ఉన్నాయి. 38 మంది మ‌ర‌ణించిన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, సంక్షేమ శాఖ తెలిపింది.