కరోనా కేసుల నమోదులో 4వ స్థానంలో భారత్

దేశంలో కరోనా అదుపులోకి వచ్చినదంటూ లాక్ డౌన్ ను క్రమంగా దేశం అంతా ఒక వంక సడలిస్తుండగా, మరోవంక రోజు రోజుకు కేసుల నమోదు సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తున్నది. కేసుల నమోదులో మొన్నటి వరకు 10 తర్వాతి స్థానాలలో ఉంటూ వచ్చిన భారత్ ఇప్పుడు నాలుగో స్థానంకు చేరుకొంది. అమెరికా, బ్రెజిల్‌, రష్యా తరువాత అత్యధికంగా మనదేశంలోనే ఇప్పుడు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్‌లో రోజుకు 20 వేల వరకూ, రష్యాలో ఎనిమిది వేల […]

Written By: Neelambaram, Updated On : May 24, 2020 10:48 am
Follow us on


దేశంలో కరోనా అదుపులోకి వచ్చినదంటూ లాక్ డౌన్ ను క్రమంగా దేశం అంతా ఒక వంక సడలిస్తుండగా, మరోవంక రోజు రోజుకు కేసుల నమోదు సంఖ్య మాత్రం పెరుగుతూ వస్తున్నది. కేసుల నమోదులో మొన్నటి వరకు 10 తర్వాతి స్థానాలలో ఉంటూ వచ్చిన భారత్ ఇప్పుడు నాలుగో స్థానంకు చేరుకొంది.

అమెరికా, బ్రెజిల్‌, రష్యా తరువాత అత్యధికంగా మనదేశంలోనే ఇప్పుడు పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అమెరికా, బ్రెజిల్‌లో రోజుకు 20 వేల వరకూ, రష్యాలో ఎనిమిది వేల వరకూ కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మృతుల విషయానికి వస్తే అమెరికాలో 97 వేలు దాటగా, బ్రెజిల్‌లో 20 వేలు, రష్యాలో 3,249గా ఉన్నాయి. మొత్తం కేసుల వారీగా చూస్తే పై మూడు దేశాల్లో వరుసగా 16.32 లక్షలు, 3.14 లక్షలు, 3.26 లక్షలుగా ఉన్నాయి.

1.25 లక్షల కేసులకు చేరడానికి మనదేశానికి 115 రోజులు పట్టగా, బ్రిటన్‌లో 53 రోజులు, అమెరికాలో 69 రోజులు, రష్యాలో 93 రోజులు పట్టింది. మన దేశంలో ఈ నెల ప్రారంభంలో ఒకరోజు కొత్తగా నమోదయ్యే కేసుల సంఖ్య 2,400 దాటింది. ఈ నెల 19వ తేదీని మినహాయిస్తే గత వారం రోజులుగా కేసుల సంఖ్య ఐదు వేల నుంచి ఆరు వేల మధ్య కొనసాగుతోంది.

గత 24 గంటల్లో దేశంలో 6,654 మందికి కొత్తగా కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం ప్రకటించింది. కొన్ని రోజులుగా 6,000 కంటే అధికంగా కేసులు నమోదవుతున్నాయని, ఒక్కరోజులో నమోదైన అత్యధిక కేసులు ఇవేనని పేర్కొంది. గత 24 గంటల్లో 137 మంది మరణించారు. దీంతో కరోనా మఅతుల సంఖ్య 3,720కి చేరింది. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,25,101కి చేరింది.

ఇప్పటివరకు 51,783 మంది వివిధ ఆస్పత్రుల నుండి డిశ్చార్జి అయ్యారు. దేశంలో కోలుకున్న వారు 41.39 శాతం. ప్రస్తుతం దేశంలో 69,597 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ప్రధానంగా మనదేశంలో పెట్టుబడి, పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమైన మహారాష్ట్ర, గుజరాత్‌, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. 69,597 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

మహారాష్ట్రలో గత 24 గంటల్లో 2,940 కొత్త కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 44,582కు చేరగా, 63 మంది మరణించారు. ఆ రాష్ట్ర రాజధాని ముంబయిలో 1,751 కొత్త కేసులు నమోదవగా, 27మంది మృతిచెందారు. తమిళనాడులో 14,753 కేసులు నమోదవగా, 98మంది మరణించారు. దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 591 కొత్త కేసులు నమోదవగా, 23 మంది మృతి చెందగా, మొత్తం కేసుల సంఖ్య 12,910కి, మృతుల సంఖ్య 231కి పెరిగింది.

కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య పెరగడం కూడా కేసుల సంఖ్య పెరుగుదలకు కారణంగా ఐసిఎంఆర్‌ చెబుతోంది. ఈ నెల 22 నాటికి 27.55 లక్షల పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది.