Telangana Govt: తెలంగాణలో మద్యం దుకాణాల కోసం ప్రభుత్వం వేలం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో గౌడ సామాజిక వర్గానికి 15 శాతం, ఎస్సీలకు పది శాతం, ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు. ఇంతవరకు వేలం మాత్రం నిర్వహించడం లేదు. దీంతో ఆశావహులకు ఆశలు పెరిగిపోతున్నాయి. మద్యం దుకాణాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
రాష్ర్టంలో 350కి పైగా మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలని సర్కారు భావించింది. ఎక్కడెక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో అక్కడ రెండో దుకాణానికి అనుమతి ఇవ్వాలని సంకల్పించింది. దీంతో రాష్ర్టవ్యాప్తంగా దుకాణాల సంఖ్య 2216 కు చేరే అవకాశం కలుగుతోంది. మద్యం ఏరులై పారే సూచనలు కనిపిస్తున్నాయి. సర్కారు నిర్ణయంతో ప్రతిపక్షాలు నివ్వెరపోతున్నాయి.
మద్యం దుకాణాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుతం 2500 కు పెరిగే అవకాశం ఏర్పడింది. రిజర్వేషన్ల అమలులో మాత్రం సర్కారు ముందుచూపు ప్రదర్శించడం లేదు. అనుకున్న మాట ప్రకారం రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించడం లేదు. ఫలితంగా పోటీ తీవ్రం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
మరోవైపు రిజర్వేషన్లు దుర్వినియోగం చేస్తున్నారనే అపవాదు మూటగట్టుకుంటోంది. ప్రభుత్వం అన్నింటిని సమన్వయం చేసి దుకాణాల నిర్వహణకు నడుం బిగించాల్సి ఉన్నా ముందస్తు ప్రణాళికలు లేకుండా పోవడంతో అప్రదిష్ట ఎదుర్కొంటోంది. దీంతో ఎవరికి దుకాణాలు వస్తాయో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read: మందుబాబులకు ఇంతకంటే ఊరట ఉంటుందా?