https://oktelugu.com/

Tollywood Hero’s Marriages: ‘ఐటెం గర్ల్’లను పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

Tollywood Hero’s Marriages: తెలుగు సినీ తారల పెళ్లిళ్లు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. కొందరేమో ఈ సినీ రంగంలోని కుటుంబాలనే ఏరికోరి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు వ్యాపారవేత్తల కుటుంబాల్లోని అమ్మాయిలను పట్టేస్తారు. మరికొందరు ఏమో సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని పల్లెటూరి పిల్లలను పట్టుకొచ్చుకుంటారు. ఎవరు ఎవరిని చేసుకున్నా వారి సంసారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లినప్పుడే సక్కగా నడుస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా నాగచైతన్య-సమంతలా విడాకులకు దారితీస్తుంది. చిన్న హీరోలు, మీడియా రేంజ్ హీరోలు, అగ్రహీరోల్లోనూ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 6, 2021 / 06:08 PM IST
    Follow us on

    Tollywood Hero’s Marriages: తెలుగు సినీ తారల పెళ్లిళ్లు చాలా విచిత్రంగా జరుగుతుంటాయి. కొందరేమో ఈ సినీ రంగంలోని కుటుంబాలనే ఏరికోరి పెళ్లి చేసుకుంటారు. మరికొందరు వ్యాపారవేత్తల కుటుంబాల్లోని అమ్మాయిలను పట్టేస్తారు. మరికొందరు ఏమో సినీ ఇండస్ట్రీకి సంబంధం లేని పల్లెటూరి పిల్లలను పట్టుకొచ్చుకుంటారు. ఎవరు ఎవరిని చేసుకున్నా వారి సంసారం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లినప్పుడే సక్కగా నడుస్తుంది. ఏమాత్రం తేడా కొట్టినా నాగచైతన్య-సమంతలా విడాకులకు దారితీస్తుంది.

    tollywood heros

    చిన్న హీరోలు, మీడియా రేంజ్ హీరోలు, అగ్రహీరోల్లోనూ ఇప్పుడు విడాకుల వ్యవహారాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే కొందరు సినీ ఇండస్ట్రీలోని ‘ఐటెం గర్ల్’లను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. మాసాల పాటల్లో నర్తించే భామలను ఏరికోరి చేసుకున్నారు.

    ఒకప్పుడు టాలీవుడ్ లో ఐటెం సాంగ్ లలో కొందరు హాట్ భామలు మాత్రమే నర్తించేవారు.కానీ ఇప్పుడు ఏ హీరోయిన్ అయినా కోట్లు కుమ్మరిస్తే చేయడానికి రెడీ అవుతోంది. అయితే తెలుగునాట ఫుల్ పాపులర్ అయిన ఇద్దరు ఐటెం గర్ల్ లను పెళ్లి చేసుకున్నారు ఇద్దరు టాలీవుడ్ నటులు..

    డేరింగ్ నటుడు శ్రీహరితోపాటు మరో హీరో జేడీ చక్రవర్తిలు ఇలా ఐటెం భామలను పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. మొదట్లో నెగెటివ్ రోల్స్ చేసి అనంతరం హీరోలు అయిన వీరిద్దరూ మారారు.

    నాడు అనేక ఐటెం సాంగ్ లలో నర్తించి క్రేజ్ సంపాదించుకున్న డిస్కో శాంతిని శ్రీహరి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్దబ్బాయి మేఘాంశ్ హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. శ్రీహరి బాటలోనే జేడీ చక్రవర్తి కూడా నెగెటివ్ రోల్స్ తో పాపులర్ అయ్యాడు. తర్వాత హీరోగా కూడా యూత్ ఫుల్ చిత్రాలు చేసి హిట్లు అందుకున్నాడు. రాంగోపాల్ వర్మ సినిమాలో వ్యాంప్ పాత్రలు చేసిన అనుకృతిని పెళ్లి చేసుకున్నాడు జేడీ. ఆమె కూడా పలు సినిమాల్లో ఐటెం సాంగ్స్ లలో నర్తించింది. ఇలా ఈ ఇద్దరు హీరోలు ఐటెం గర్ల్ లను తమ జీవితంలోకి ఆహ్వానించారు.