https://oktelugu.com/

గెలుపు వేళ.. జాతినుద్దేశించి ప్రసంగించిన జోబైడెన్

నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే ట్రంప్‌ ఓ అడుగు ముందుకేసి రెండు రోజుల క్రితం తానే గెలుస్తున్నట్లు ప్రకటించారు. కానీ.. తాజాగా మెజార్టీ బైడెన్‌ వైపు మళ్లింది. దీంతో బైడెన్‌ శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడారు. ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్‌ అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌‌కు మాత్రం చేరువలో […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 2:34 pm
    Follow us on

    Joe Biden Speech

    నువ్వా నేనా అన్నట్లుగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఇప్పటికే ట్రంప్‌ ఓ అడుగు ముందుకేసి రెండు రోజుల క్రితం తానే గెలుస్తున్నట్లు ప్రకటించారు. కానీ.. తాజాగా మెజార్టీ బైడెన్‌ వైపు మళ్లింది. దీంతో బైడెన్‌ శుక్రవారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడారు. ట్రంప్‌పై 40లక్షల ఓట్ల తేడాతో గెలుస్తున్నామని చెప్పారు. అగ్రరాజ్య అధ్యక్ష పీఠం ఎవరిదన్న దానిపై ఇంకా స్పష్టత రానప్పటికీ బైడెన్‌ అత్యధిక ఎలక్టోరల్‌ ఓట్లతో అధికారానికి అవసరమైన మ్యాజిక్‌ ఫిగర్‌‌కు మాత్రం చేరువలో ఉన్నారు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్

    ఇంకా ఏమన్నారంటే.. ‘అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ పార్టీ గెలిచినట్లు ఇప్పుడే ప్రకటించట్లేదు. అయితే.. ఈ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీతో గెలవబోతున్నామని తాజాగా వెలువడుతున్న ఫలితాలే చెబుతున్నాయి. 24 గంటలు క్రితం వరకు జార్జియాలో వెనుకంజలో ఉన్న మేము ప్రస్తుతం ఆధిక్యంలో కొనసాగుతున్నాం. పెన్సిల్వేనియాలో కూడా ముందంజలో ఉన్నం. 24 ఏళ్ల తర్వాత అరిజోనాలో, 28 ఏళ్ల తర్వాత జార్జియాలో గెలుస్తున్న తొలి డెమొక్రాట్స్ కూడా మేమే. నాలుగేళ్ల క్రితం రిపబ్లికన్ల చేతిలో ఓడిపోయిన చాలా రాష్ట్రాలు ఇప్పుడు నీలవర్ణంలోకి మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో 7.4 కోట్ల ఓట్లతో విజయం సాధించబోతున్నాం. ట్రంప్‌పై 40 లక్షల ఓట్లతో గెలుస్తున్నాం. 300కి పైగా ఎలక్టోరల్‌ ఓట్లు సాధించబోతున్నాం’ అని ధీమా వ్యక్తం చేశారు.

    Also Read: గెలుపు లాంఛనమే: వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టనున్న బైడెన్‌..!

    అన్ని ప్రాంతాలు, మతాలకతీతంగా రికార్డు స్థాయిలో అమెరికన్లు మార్పును కోరుకుంటున్నారని ఫలితాలలో స్పష్టమవుతోందని చెప్పారు. కోవిడ్‌ వైరస్‌, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణ మార్పుపై ప్రకటించిన ప్రణాళికలే తమను గెలిపిస్తున్నాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజే మా ప్రణాళికలను అమల్లోకి తెస్తామని చెప్పారు. కరోనాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

    Also Read: మోడీ పిలుపునకు బీహార్‌ లో ఓట్లు రాలుతాయా?

    ఇలాంటి సమయంలో ఉద్రిక్తతలు, ఆందోళనలు ఉంటాయని.. అందరూ సంయమనం పాటించాలని పిలుపునిచ్చారు. తప్పకుండా అందరి ఓట్లు లెక్కిస్తారని.. రాజకీయాల్లో ప్రత్యర్థులం అయినంత మాత్రాన శత్రువులం కాదు కదా అని పేర్కొన్నారు. మనమంతా అమెరికన్లం అంటూ ముగించారు.