వైరల్: ఆరోజుల్లో.. కేటీఆర్ పాత జ్ఞాపకం..

ఒకప్పటి భాగ్యనగరానికి.. ఇప్పటి హైదరాబాద్‌కు చాలా తేడా ఉంది. అప్పుడు డబుల్‌ డెక్కర్‌‌ బస్సులు తిరిగితే.. ఇప్పుడు మెట్రో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు మహానగరంలో తిరిగే డబుల్ డెక్కర్‌‌ బస్సులు చూసేందుకైనా.. వాటిలో ప్రయాణించేందుకైనా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే వారు. నిజాంకాలంలోనే ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా సిటీలో రద్దీగా ఉండే రహదారులపై డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేవి. అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్, కోటి, అసెంబ్లీ, […]

Written By: NARESH, Updated On : November 7, 2020 2:21 pm
Follow us on

ఒకప్పటి భాగ్యనగరానికి.. ఇప్పటి హైదరాబాద్‌కు చాలా తేడా ఉంది. అప్పుడు డబుల్‌ డెక్కర్‌‌ బస్సులు తిరిగితే.. ఇప్పుడు మెట్రో రైళ్లు పరిగెడుతున్నాయి. అప్పుడు మహానగరంలో తిరిగే డబుల్ డెక్కర్‌‌ బస్సులు చూసేందుకైనా.. వాటిలో ప్రయాణించేందుకైనా ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చే వారు. నిజాంకాలంలోనే ఈ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. ప్రధానంగా సిటీలో రద్దీగా ఉండే రహదారులపై డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించేవి.

అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్ వరకు అబిడ్స్, నాంపల్లి స్టేషన్ రోడ్, కోటి, అసెంబ్లీ, పారడైజ్ గుండా రాకపోకలు సాగిస్తుండేవి. చాలా మంది విద్యార్థులు తమ స్కూళ్లకు వెళ్లేందుకు 8A, 7 నంబర్ గల డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించేవారు. అయితే ఈ బస్సులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌‌.

Also Read: కేసీఆర్ రంగంలోకి.. ఏం జరుగనుంది?

కాలక్రమేణా డబుల్‌ డెక్కర్‌‌ బస్సులు కనుమరుగయ్యాయి. తాజాగా వాటిని గుర్తుచేస్తూ షాకీర్ హుస్సేన్ అనే యువకుడు ఐటీ మినిస్టర్ కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. ఒకప్పుడు డబుల్ డెక్కర్ బస్సు సికింద్రాబాద్ నుంచి జూపార్క్ మార్గంలో 7 నంబర్‌తో నడిచేవి. జూపార్క్ నుంచి హైకోర్టు, అఫ్జల్‌గంజ్‌, అబిడ్స్‌, హుస్సేన్ సాగర్‌, రాణిగంజ్ మీదుగా సికింద్రాబాద్‌కు చేరుకునేవి. హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులను ప్రయాణికులు లేదా టూరిస్టుల కోసం తీసుకురావాలని షాకీర్ హుస్సేన్ కేటీఆర్‌ను కోరారు. షాకీర్ చేసిన ఈ ట్వీట్‌పై కేటీఆర్ స్పందించారు.

Also Read: ఇంతకీ జగన్ చేస్తున్నది తప్పా? ఒప్పా?

తన స్కూల్ రోజులను కేటీఆర్‌‌ మరోసారి గుర్తు చేసుకున్నారు. అబిడ్స్‌లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో తాను చదువుకున్నప్పుడు.. దారిగుండా వెళ్తున్నప్పుడు డబుల్ డెక్కర్ బస్సులు కనిపించేవి. డబుల్ డెక్కర్ బస్సుల గురించి చాలా జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. ఆ బస్సులను ఎందుకు ఆపేశారో తనకు కచ్చితంగా తెలియదన్నారు. డబుల్ డెక్కర్ బస్సులను మళ్లీ రోడ్లపైకి తీసుకువచ్చేందుకు ఏమైనా అవకాశం ఉందా? అంటూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ను కేటీఆర్ అడిగారు. కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఒకవేళ అలాంటి అవకాశమే కనుక ఉంటే.. మరోసారి సిటీలో డబుల్‌ డెక్కర్‌‌ బస్సులు చూడవచ్చేమో.