https://oktelugu.com/

Dussehra : దసరా రోజున దేశవ్యాప్తంగా రావణ దహనం జరిగితే.. ఇక్కడ మాత్రం రాక్షస రాజును పూజిస్తారు.. ఇంతకీ ఈ ప్రాంతం ఎక్కడుందంటే..

దసరా పర్వదినం నేడు దేశ వ్యాప్తంగా ఘనంగా జరుగుతోంది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోతీరుగా దసరా వేడుకలు జరుగుతున్నాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా దసరా సందర్భంగా రావణ దహనం నిర్వహిస్తుంటారు.

Written By: NARESH, Updated On : October 12, 2024 5:02 pm

Dussehra, Dussehra specialty

Follow us on

Dussehra : తెలంగాణ ప్రాంతంలో ఆయుధ పూజ అనంతరం రావణ దహనం నిర్వహిస్తుంటారు. రావణ దహనం వెనుక చారిత్రాత్మక ఐతిహ్యం కూడా ఉంది. పూర్వం రావణాసురుడు సీతమ్మ తల్లిని ఎత్తుకెళ్లినప్పుడు.. రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయుడు, వానర సమూహం సీతమ్మ తల్లిని తిరిగి అయోధ్యకు తీసుకొచ్చి. ఈ క్రమంలో రాముడు తన రామ బాణం వేసి రావణాసురుడిని సంహరించాడు. ఆ సందర్భంగా ప్రజలు దసరా పండుగ చేసుకున్నారని ఓ కథనం ప్రచారంలో ఉంది. అప్పుడు ప్రజలు పండగ చేసుకున్నారని.. రావణాసురుడి బొమ్మను ఏర్పాటు చేసి దహనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తోంది.. ఇక నాటి సాంప్రదాయాన్ని నేటికీ దక్షిణాది రాష్ట్రాలలో కొనసాగిస్తున్నారు.. ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రావణ దహన కార్యక్రమాన్ని జరుపుతున్నారు.

ఇక్కడ మాత్రం విభిన్నంగా..

తమిళనాడులోని కొన్ని ప్రాంతాలలో రావణుడిని దేవుడిగా పూజిస్తారు. అయితే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని బిస్రఖ్ అనే గ్రామంలో రావణాసురుడిని దహనం చేయరు. పైగా ఈ గ్రామం రావణాసురుడి జన్మస్థలంగా అక్కడి ప్రజలు పేర్కొంటున్నారు. ఇది ఢిల్లీకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పైగా తమను తాము అక్కడికి గ్రామస్తులు రావణాసురుడి వారసులుగా పేర్కొంటారు. సాధారణంగా ఉత్తరాది రాష్ట్రాలలో దసరా రోజు రావణుడు, మేఘనాథుడు, కుంభకర్ణుడి బొమ్మలను దహనం చేస్తుంటారు. అయితే బిస్రఖ్ గ్రామంలో రావణాసుర దహనం జరగదు. పైగా రావణాసురుడు చనిపోయాడనే బాధతో ఆ గ్రామస్తులు సంతాపం వ్యక్తం చేస్తారు. అతడి ఆత్మ శాంతించాలని పూజలు చేస్తుంటారు. అతని రూపాన్ని పోలిన బొమ్మలు తయారుచేసి గ్రామంలో ప్రదర్శన నిర్వహిస్తుంటారు..” మేము రావణాసురుడి వారసులం. అతడి దహనాన్ని మేము చేపట్టలేం. అతడు మా గ్రామానికి చెందినవాడు. రాక్షస రాజు కాబట్టి గొప్పవాడు.. గొప్పగా పరిపాలించాడు.. అతడు ప్రతి నాయకుడు కాదు. లంక రాజ్యానికి నాయకుడు. అతని అపారమైన భక్తికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అనేక వరాలు ఇచ్చాడు. అందువల్లే అతని దహనాన్ని మేము ఒప్పుకోమని” బిస్రఖ్ గ్రామస్తులు చెబుతుంటారు. అయితే రావణుడిని పూజించినప్పటికీ.. వారు రాముడిని కూడా ఆరాధిస్తుంటారు. అయితే ఈ గ్రామానికి బిస్రఖ్ అనే పేరును విశ్రవస్ అనే పదం నుంచి తీసుకున్నారని గ్రామస్తులు చెబుతుంటారు. అయితే ఈ గ్రామం మాత్రమే కాకుండా.. కాన్పూర్, మధ్యప్రదేశ్ లోని విధిష జిల్లా, కర్ణాటకలోని మాండ్య జిల్లాలో రావణాసురుడికి ఆలయాలు ఉన్నాయి. అక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. దసరా సమయంలో ఆలయాలలో ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లోనూ రావణాసురుడికి ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలలో నిత్యం పూజలు జరుగుతుంటాయి.. శ్రీలంక నుంచి భక్తులు ఈ ఆలయాలకు వస్తుంటారు.. పూజలు జరుపుతుంటారు.