Viswam Movie: కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొడుతుంటాయి, కొన్ని మాత్రం గుట్టు చప్పుడు కాకుండా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి బ్లాక్ బస్టర్స్ గా నిలుస్తుంటాయి. అలా చాలా కాలం నుండి సూపర్ హిట్ సినిమాలు లేక మార్కెట్ మొత్తం పూర్తిగా పోగొట్టుకునే స్థాయికి పడిపోయిన గోపీచంద్ నుండి నిన్న విడుదలైన విశ్వం చిత్రం సూపర్ హిట్ దిశగా అడుగులు వేస్తున్నట్టు ట్రేడ్ వర్గాల్లో బలంగా వినిపిస్తున్న మాట. నిన్న ఈ చిత్రం మార్నింగ్ షోస్ దారుణమైన ఆక్యుపెన్సీలతో ప్రారంభం అయ్యింది. కొన్ని చోట్ల లైసెన్స్ సమస్యలు కారణంగా షోస్ క్యాన్సిల్ కాబడ్డాయి. ఇవన్నీ చూసిన తర్వాత ఈ సినిమాకి కనీసం కోటి రూపాయిల గ్రాస్ వసూళ్లు అయినా వస్తాయా అని అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో సాయంత్రం షోస్ నుండి మంచి ఆక్యుపెన్సీలతో మొదలైంది.
సెకండ్ షోస్ కి ప్రతీ చోట హౌస్ ఫుల్ బోర్డు పడ్డాయి. దీంతో మొదటి రోజు ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్ దక్కింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 2 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 5 కోట్ల రూపాయలకు జరిగింది. నేటి తో బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. నేడు దసరా అవ్వడంతో ఈ చిత్రానికి మ్యాట్నీ షోస్ నుండి ప్రతీ చోట హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి. ఆడియన్స్ కి ప్రస్తుతానికి ‘దేవర’ చిత్రం మొదటి ఛాయస్, అందులో ఎలాంటి సందేహం లేదు. ఆ తర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘వెట్టియాన్’ చిత్రం రెండవ ఛాయస్ గా ఉంటుందని అనుకున్నారు. కానీ అనూహ్యంగా వెట్టియాన్ చిత్రం కంటే ముందుగా గోపీచంద్ ‘విశ్వం’ సినిమా హౌస్ ఫుల్స్ అవ్వడం గమనార్హం. దీంతో నేడు ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు మొదటి రోజు కంటే ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అంతే కాకుండా బుక్ మై షో టికెట్ పోర్టల్ యాప్ లో కూడా ఈ చిత్రానికి నేడు గంటకు 4 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోతున్నాయి. హైదరాబాద్ లో షెడ్యూల్ చేసిన షోస్ మొత్తం హౌస్ ఫుల్స్ అవ్వడం మరో విశేషం. మొదటి రోజు కనీసం మార్నింగ్, మ్యాట్నీ షోస్ టాప్ థియేటర్స్ కూడా హౌస్ ఫుల్ అవ్వని పరిస్థితి నుండి, ఇప్పుడు ప్రతీ సెంటర్ లో హౌస్ ఫుల్ పడే స్థాయికి వచ్చిందంటే గోపీచంద్ కి ఇంకా మార్కెట్ ఉంది అనే విషయం అర్థం అవుతుంది. మరోపక్క ఈ సినిమాతో శ్రీను వైట్ల కూడా బౌన్స్ బ్యాక్ అయ్యినట్టే అని చెప్పుకోవాలి. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కి కూడా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత ఈ సినిమా తో హిట్ ని అందుకున్నారు.