రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై కవిత ఓటమి ప్రభావం!

నిజామాబాదు నుండి లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తన కుమార్తె కవితే ఓటమిని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంతా జీర్ణించుకోలేక పోతున్నారా? దానిని తన వ్యక్తిగత ఓటమిగా భావిస్తున్నారా? అంటే రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థుల ఎంపిక తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. కవిత ఓటమికి పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తిరుగుబాటు చేసిన మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను మూల కారకుడిగా భావిస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా కవితపై గెలుపొందిన డి అరవింద్ ఆయన కుమారుడే కావడం […]

Written By: Neelambaram, Updated On : March 13, 2020 5:16 pm
Follow us on

నిజామాబాదు నుండి లోక్ సభకు జరిగిన ఎన్నికలలో తన కుమార్తె కవితే ఓటమిని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఇంతా జీర్ణించుకోలేక పోతున్నారా? దానిని తన వ్యక్తిగత ఓటమిగా భావిస్తున్నారా? అంటే రాజ్యసభకు ఇద్దరు అభ్యర్థుల ఎంపిక తీరు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది.

కవిత ఓటమికి పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ తిరుగుబాటు చేసిన మాజీ పిసిసి అధ్యక్షుడు డి శ్రీనివాస్ ను మూల కారకుడిగా భావిస్తున్నారు. బిజెపి అభ్యర్థిగా కవితపై గెలుపొందిన డి అరవింద్ ఆయన కుమారుడే కావడం గమనార్హం.

ఒక వంక కాంగ్రెస్ కు చెందిన కీలక వ్యక్తులు అందరు అరవింద్ కు మద్దతు ఇచ్చేటట్లు చేయడంతో పాటు, టి ఆర్ ఎస్ లో కవిత పట్ల విముఖంగా ఉంటున్న వారు సహితం బిజెపికి అండగా అండగా ఉండే విధంగా శ్రీనివాస్ తెరవెనుక నుండి చక్రం తిప్పారని భావిస్తున్నారు.

గతంలో కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్న తనను తన సొంత జిల్లా నుండి ఎంపీగా ఉన్న సమయంలో కవిత లెక్కచేయక పోవడం, పైగా పలు సందర్భాలలో తన పట్ల అవమానకరంగా వ్యవహరిస్తూ ఉండడంతోనే శ్రీనివాస్ పార్టీపై ఎదురు తిరిగారని చెబుతున్నారు.

ఈ విషయంలో కుమార్తెకు నచ్చచెప్పలేక కేసీఆర్ మౌనం వహించడంతో కవిత ఓటమికి డీఎస్ కంకణం కట్టుకున్నారు. పైగా బిజెపి అభ్యర్థిగా కుమారుడే పోటీ చేస్తూ ఉండడంతో అతని గెలుపుకోసం చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేశారు.

జరుగుతున్న ప్రమాదాన్ని ఎన్నికల సమయంలోనే గ్రహించిన కేసీఆర్ అదే జిల్లాకు చెందిన సీనియర్ టిడిపి నేత మండవ వెంకటేశ్వరావు ఇంటికి స్వయంగా వెళ్లి, టి ఆర్ ఎస్ లో చేరి కుమార్తెకు మద్దతు ఇచ్చేటట్లు చేసుకున్నారు. ఆయన రెండు రోజులు తిరిగినా ప్రయోజనం లేకపోయింది.

నిజామాబాదు లో డీఎస్ ప్రాబల్యాన్ని కట్టడి చేయడం కోసం ఆ జిల్లా నుండి సీనియర్ కాంగ్రెస్ నాయకుడైన మాజీ స్పీకర్ కె ఆర్ సురేష్ రెడ్డిని ఒక వంక రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. తద్వారా ఆ జిల్లాల్లో రాజకీయంగా ప్రాబల్యం వహిస్తున్న సామజిక వర్గాన్ని సంతృప్తి పరచే ప్రయత్నం చేశారు.

మరోవంక డీఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్న సామజిక వర్గానికే చెందిన కె కేశవరావుకు సీట్ నిరాకరిస్తే ఆ వర్గంలో అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉన్నదని గ్రహించి ఆయనకు మరోసారి సీట్ ఇవ్వక తప్పలేదు. ఇప్పటికే రెండు సారులుగా రాజ్యసభ సభ్యుడుగా ఉంటున్న ఆయన వయస్సు 80 సంవత్సరాలు.

కుమార్తె కవితను రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా, వ్యూహాత్మకంగా కేసీఆర్ ఈ ఎంపిక చేసారని చెబుతున్నారు. త్వరలో కుమారుడికి ముఖ్యమంత్రి పదవి అప్పచెప్పడానికి అదును కోసం ఎదురు చూస్తున్న ఆయన ఆమెను ఇప్పుడు ఢిల్లీకి పంపడం పట్ల విముఖంగా ఉన్నట్లు తెలుస్తున్నది.