తమిళనాడులోని తూత్తుకూడి జిల్లా కోవిల్ పట్టిలో స్టాలిన్ కాలనీలో మదన్ కుమార్ (23) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అదే కాలనీలో సెల్వి అనే చిత్రాంగి సైతం భర్తతో కలిసి ఉంటోంది. పరాయి మగాళ్లకు మరిగిన సెల్వి యువకులకు గాలం వేయడమే పని గా పెట్టుకుంది. ఆమె కంటిలో మదన్ కుమార్ పడ్డాడు. అతడితో సమయం దొరికినప్పుడల్లా గడుపుతూ ఎంజాయ్ చేస్తోంది. అయితే అదే ప్రాంతంలో ఉండే మరో 17 ఏళ్ల కుర్రాడిని సైతం తన చూపుల్లో పడేసింది. అతడితో కూడా ఏకాంతంగా గడిపేది. ఇలా కొన్నాళ్లు సాగిన వీరి అశ్లీల శృంగారంలో బాలుడికి మదన్ కుమార్ తో కూడా సంబంధం ఉందని తెలిసిపోయింది.
దీంతో ఆ బాలుడు సెల్వి తనకే సొంతం కావాలని అనుకున్నాడు. మదన్ కుమార్ అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు. మద్యం అలవాటు ఉండడంతో ఇద్దరు బాగా మద్యం తాగారు. దీంతో బాలుడు తన వెంట తెచ్చుకున్న కొడవలితో మదన్ కుమార్ ను నరికేశాడు. తెలిసితెలియని వయసులో ఇంతటి ఘాతుకానికి పాల్పడిన బాలుడి గురించి అందరిలో ఆశ్చర్యం వేస్తోంది. ఇంత చిన్న వయసులో వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ వ్యక్తిని చంపడం అంటే మామూలు విషయం కాదని పలువురు ఆందోళన చెందుతున్నారు.
బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడుతున్నారు. అతడిని బాల నేరస్తుల కారాగారానికి పంపించారు. కిలాడీ లేడీని ఇద్దరు ప్రేమించడం ఒకరు హత్యకు గురికావడంతో తూత్తుగూడి జిల్లాలో చిత్రాంగి రహస్య బాగోతం ప్రస్తుతం సంచలనంగా మారింది. యువకుడి ప్రాణాలు గాల్లో కలవడం పై విచారం వ్యక్తం చేస్తున్నారు.