Homeఆంధ్రప్రదేశ్‌5న ఏపీలో కేఆర్ ఎంబీ పర్యటన సాగుతుందా?

5న ఏపీలో కేఆర్ ఎంబీ పర్యటన సాగుతుందా?

KRMBకృష్ణా నదీ జలాల బోర్డు ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని సందర్శించేందుకు తేదీ ఖరారు చేసింది. ఏపీ ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా ప్రాజెక్టును సందర్శించి అక్కడ పనులు జరుగుతున్నాయో లేదో తెలుసుకుని నివేదిక సమర్పించేందుకు రెడీ అవుతోంది. లాంఛనంగా సమాచారం ఏపీకి ఇచ్చింది. కమిటీలో తెలంగాణ ప్రతినిధులు ఉండవద్దని ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. దీంతో ఏపీ డిమాండ్ ను బోర్డు పట్టించుకునేలా కనిపించడం లేదు. ప్రాజెక్టును సందర్శించి అక్కడ పరిస్థితిని అంచనా వేయనుంది.

గతంలోనే చాలాసార్లు కేఆర్ ఎంబీ ప్రాజెక్టును సందర్శించాలని అనుకున్నా ఆచరణ సాధ్యం కాలేదు. దీనికి ఏపీ సర్కారు మాత్రం పదేపదే వద్దని వారిస్తోంది. రక్షణ ఉండదనే కారణంతో కృష్ణా బోర్డు ఇన్నాళ్లు అక్కడ పర్యటించలేదు. అయితే ఎన్జీటీ ఆదేశాలను సైతం ఏపీ పట్టించుకోలేదు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై విచారణ జరిపిన బోర్డు ప్రాజెక్టును సందర్శించాలని తేల్చి చెప్పడంతో ఈనెల 5న కేఆర్ ఎంబీ బృందం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనుంది.

రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు అనుమతులు లేకపోయినా నిర్మాణ పనులు ఆగడం లేదని తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ప్రాజెక్టు పనులు నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వానికి చెబుతున్నా నిర్లక్ష్యం వహిస్తోంది. ఏపీ మాత్రం అక్కడ పనులు జరగడం లేదని బుకాయిస్తోంది. డీపీఆర్ కు సర్వే పనులు మాత్రమే చేస్తున్నామని పేర్కొంటోంది.

అక్కడ పనులు జరుగుతున్నాయని ఎన్జీటీకి ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది. గతంలోనే పర్యావరణ అనుమతులు లేవని ఎన్జీటీ స్టే ఇచ్చినా ఏపీ ప్రభుత్వం నిర్మిస్తే చీఫ్ సెక్రటరీని జైలుకు పంపిస్తామని ఎన్జీటీ హెచ్చరించింది. కేఆర్ఎంబీ కమిటీని ఏపీ ప్రభుత్వం అనుమతిస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. దీంతో కమిటీ రిపోర్టు ఇస్తుందా అని ఆసక్తికరంగా మారింది. పనులు నిర్వహిస్తుండడంపై నివేదిక ఇస్తే ఏపీ చిక్కుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version