https://oktelugu.com/

రోజాకు మళ్లీ నిరాశేనా..?

వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజాకు న్యాయం జరగడం లేదు. ఆమె రెండేళ్లుగా మంత్రి పదవి వస్తుందని ఆశించినా నిరాశే ఎదురవుతోంది. దీంతో ఆమె అనుచరుల్లో నైరాశ్యం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై పలు కామెంట్లు వస్తున్నాయి. కనీసం నామినేటెడ్ పదవి సైతం రాకుండా చేశారు. దీంతో ముఖ్యమంత్రి నిర్ణయంపై అంతటా ఆందోళన కలుగుతోంది. సీఎం జగన్ గెలుపులో తనవంతు పాత్ర పోషించిన రోజాకు ఇప్పటివరకు సముచిత స్థానం మాత్రం దక్కడం లేదు. దీంతో ఆమెకు […]

Written By: , Updated On : August 3, 2021 / 06:53 PM IST
Follow us on

MLA Roja minister postవైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న రోజాకు న్యాయం జరగడం లేదు. ఆమె రెండేళ్లుగా మంత్రి పదవి వస్తుందని ఆశించినా నిరాశే ఎదురవుతోంది. దీంతో ఆమె అనుచరుల్లో నైరాశ్యం నెలకొంది. సామాజిక మాధ్యమాల్లో దీనిపై పలు కామెంట్లు వస్తున్నాయి. కనీసం నామినేటెడ్ పదవి సైతం రాకుండా చేశారు. దీంతో ముఖ్యమంత్రి నిర్ణయంపై అంతటా ఆందోళన కలుగుతోంది. సీఎం జగన్ గెలుపులో తనవంతు పాత్ర పోషించిన రోజాకు ఇప్పటివరకు సముచిత స్థానం మాత్రం దక్కడం లేదు. దీంతో ఆమెకు ఆందోళన పెరుగుతోందని తెలుస్తోంది. టీడీపీని వదిలి వచ్చిన ఆమెకు పార్టీలో మంచి గుర్తింపు వస్తుందని ఊహించిన వారి ఆశలు అడియాశలే అవుతున్నాయి. జగన్ నిర్ణయంతో ఏం మాట్లాడలేని వైనం.

ప్రస్తుతం నగరి ఎమ్మెల్యే రోజా అభివృద్ధిపై దృష్టి సారించారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం తదితర వాటిపై ప్రాధాన్యత కనబరుస్తున్నారు. సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేస్తున్నారు. కొంత సమయం షూటింగులకు మరింతకొంత సమయాన్ని ప్రజా కార్యక్రమాలకే వెచ్చిస్తున్నారు. పాదిరేడు, తట్నేరి దళిత వాడ రోడ్డు నిర్మాణాన్ని ఆసియా అభివృద్ధి బ్యాంకు ద్వారా చేయించినందుకు రోజాకు నాయకులు సన్మానం చేశారు.

రెడ్డి సామాజికవర్గం నుంచి పెద్దిరెడ్డి ఉన్నంత కాలం రోజాకు మంత్రి పదవి రాదనే విశ్లేషకులు చెబుతున్నారు. రోజా మాత్రం సీఎం జగన్ పై పూర్తి విశ్వాసం కనబరుస్తున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై ఏవో కారణాలు ఉండే ఉంటాయని భావిస్తూ కనీసం ఏ మాట కూడా మాట్టాడడం లేదు. ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ కు సీఎం జగన్ కు ఏం తేడా లేదని తెలుస్తోంది. పార్టీ ఫస్ట్ లీడర్స్ తరువాత అన్న పాలసీతో రోజా విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారని చెబుతున్నారు

జంట పదవులు వద్దనే సాకుతో రోజాను ఏపీఐఐసీ చైర్మన్ పదవి నుంచి తొలగించారు. కానీ అదే జిల్లాకు చెందిన చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాత్రం తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ) చైర్మన్ గా కొనసాగుతున్నారు. దీంతో ఈ విషయంలో రోజాను మాత్రం ఎందుకు నామినేటెడ్ పదవి నుంచి దూరం చేసినట్లు అని వైసీపీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భాస్కర్ రెడ్డి ప్రస్తుతం ప్రభుత్వ విప్ గా కూడా ఉన్నారు. దీంతో రోజాపై కావాలనే ఈ విధంగా చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి.