Homeఆంధ్రప్రదేశ్‌Electricity Employees: జీతాలు అడిగితే ఎస్మా..విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కారు ఝలక్

Electricity Employees: జీతాలు అడిగితే ఎస్మా..విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కారు ఝలక్

Electricity Employees: అత్యవసర సేవలు అందించే విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రభుత్వం షాకిచ్చింది. రెండు వారాలు దాటుతున్నా ఏప్రిల్ నెలకు సంబంధించి వేతనాలు ఇంతవరకూ అందించలేదు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే లైన్ మెన్లు, సచివాలయ ఎనర్జీ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లకు సైతం జీతాల చెల్లింపులు చేయలేదు. సాధారణంగా ప్రతీ నెల 5 నుంచి 10 వ తేదీ మధ్య జీతాలు పడుతుంటాయి. కానీ 13 దాటుతున్నా ఇంతవరకూ ఉలుకూ లేదు..పలుకూ లేదు. పైగా ఇదేమని ప్రశ్నిస్తున్న వారిపై మాత్రం ప్రభుత్వం విరుచుకుపడుతోంది. చర్యలకు ఉపక్రమిస్తోంది. ఏప్రిల్‌ నెల జీతాలు ఈ నెల 9వ తేదీవరకు రాలేదని, కనీసం 11న అయినా చెల్లించాలని కోరిన విద్యుత్‌ యూనియన్ నాయకులు కోరారు. 11వ తేదీకి కూడా జీతాలు పడకపోతే 12వ తేదీ నుంచి ఉద్యమబాట పడతామన్న విద్యుత్‌ ఉద్యోగ సంఘాలను ఏకంగా ఈ సంస్థల్లో సమ్మెని నిషేధించి ప్రభుత్వం మరింత ఆందోళనకు గురిచేసింది. ఈ నిషేధ ఉత్తర్వులు అన్ని విద్యుత్‌ సంస్థల్లో ఈ నెల పదో తేదీనుంచే అమల్లోకి వచ్చాయని స్పష్టం చేసింది. ‘‘ఇకపై ప్రతి నెల మొదటి తేదీనే ఉద్యోగులకు వేతనాలు, రిటైర్డ్‌ ఉద్యోగులకు పింఛన్లు ఇవ్వాలి. లేదంటే మరుసటి రోజున ఎలాంటి నోటీసు, సమాచారం లేకుండానే ఆందోళనలు చేపడుతాం’’ అని ఈ నెల తొమ్మిదో తేదీన ఏపీ విద్యుత్‌ ఉద్యోగుల సంయుక్త కార్యాచరణ కమిటీ.. ఇంధన శాఖ కార్యదర్శిని కలిసి స్పష్టం చేసింది. ఈ కమిటీలో విద్యుత్‌ సరఫరా, పంపిణీ సంస్థలైన ఏపీఈపీడీసీఎల్‌, ఏపీఎ్‌సపీడీసీఎల్‌, ఏపీసీడీసీఎల్‌, ఏపీ జెన్‌కోల్లో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు.

Electricity Employees
Electricity Employees

Also Read: Lottery: కలిసొస్తున్న లాటరీ.. సామాన్యులు రాత్రికి రాత్రే కోటీశ్వరలువుతున్నారు

సమ్మె నిషేధ ఉత్తర్వులు

అయితే ఈ విజ్ఞాపన చేసిన మరుసటిరోజే ఈ సంస్థల్లో ఆరు నెలల పాటు సమ్మెలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. నిజానికి విద్యుత్‌ ఉత్పత్తి, పంపిణీ, వాటి అనుబంధ విభాగాలు అత్యవ సర సేవల నిర్వహణ చట్టం (ఎస్మా)-1971 పరిధిలోనే ఉన్నాయి. ఏటేటా ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఎస్మాను పొడిగిస్తూ ఉత్తర్వులు ఇస్తుంటుంది. ఇప్పటికీ ఎస్మా అమల్లోనే ఉంది. దీన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు. అయినా ఎస్మాపేరిట సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యోగులకు షాక్‌ ఇవ్వడం కోసమేనా? అయితే ఇదంతా ఎందుకు? కారణం ఏమయి ఉంటుంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒక్కటే సమాధానం! తమకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు, పింఛన్లు ఉద్యోగులు సర్కారును కోరడమే ఎస్మా ప్రయోగానికి కారణం అయి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులు పనిచేయాలేకానీ…ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని, లేకుంటే ఆందోళన చేస్తామనడం సర్కారును ఆందోళనకు గురిచేసి ఉంటుందని, వీరిని ఇలాగే వదిలేస్తే మిగతా ప్రభుత్వ శాఖలు, సంస్థల్లోనూ ఉద్యోగులు ఇదే బాట పడతారనే భయం వెంటాడి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిజానికి విద్యుత్‌ సంస్థల ఉద్యోగుల సంఘాలు.. జీతాల కోసం ప్రభుత్వాన్ని కోరడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకు ముందు ఫిబ్రవరి 14న ఒకసారి, ఏప్రిల్‌ 7వ తేదీన మరోసారి దీనిపై రెండు లేఖలు రాశారు. ఇప్పుడు రాసింది మూడో లేఖ. అయితే, ఈసారి జేఏసీ స్వరం పెంచింది. అది సర్కారుకు నచ్చలేదు. విద్యుత్‌ సరఫరా, పంపిణీ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎస్మా చట్టం తక్షణమే అమల్లోకి తెచ్చేసింది.

Electricity Employees
Y S Jagan

Also Read: Narendra Modi: మోడీనే టార్గెట్.. కాంగ్రెస్ మేథోమథనం

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular