Narendra Modi: మోడీనే టార్గెట్.. కాంగ్రెస్ మేథోమథనం

Narendra Modi: కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా చింతన్ శిబిర్ వేదికగా మూడు రోజులు జరిపే సమావేశాల్లో ఈ మేరకు కీలక నీర్ణయాలు తీసుకునేందుక సిద్ధమైంది. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో ప్రాంతీయ పార్టీలను సైతం తమ దరికి చేర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు గాను ప్రణాళికలు తయారు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టి […]

  • Written By: Shankar
  • Published On:
Narendra Modi: మోడీనే టార్గెట్.. కాంగ్రెస్ మేథోమథనం

Narendra Modi: కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం కోసం తాపత్రయపడుతోంది. దేశంలో అన్ని రాష్ట్రాల్లో అధికారం కోల్పోయిన పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా చింతన్ శిబిర్ వేదికగా మూడు రోజులు జరిపే సమావేశాల్లో ఈ మేరకు కీలక నీర్ణయాలు తీసుకునేందుక సిద్ధమైంది. బీజేపీని ఎదుర్కొనే క్రమంలో ప్రాంతీయ పార్టీలను సైతం తమ దరికి చేర్చుకోవాలని చూస్తోంది. ఇందుకు గాను ప్రణాళికలు తయారు చేస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఢీకొట్టి బలమైన పార్టీగా ఆవిర్భవించడమే ధ్యేయంగా కాంగ్రెస్ ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.

Narendra Modi

Sonia Gandhi, Rahul Gandhi

ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు చింతన్ శిబిర్ నిర్వహిస్తోంది. దీనికి 400 మంది కాంగ్రెస్ నేతలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీ తదితరులు పాల్గొననున్నట్లు సమాచారం. పార్టీని ప్రక్షాళన చేసి భవిష్యత్ లో అధికారం చేజిక్కించుకోవాలని పార్టీ బలంగా అభిలషిస్తోంది. మరోవైపు పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకురావాలని జీ23 వ్యతిరేక వర్గం కోరుతోంది. కొందరు మాత్రం రాహుల్ గాంధీకి పగ్గాలు అప్పగించాలని కోరుతున్నా ఆయన మాత్రం సిద్ధంగా లేనటలు తెలుస్తోంది.

Also Read: Anchor Sravanthi: -ఫొటో గ్యాలరీ: యాంకర్ స్రవంతి అందాల విందు

2024 ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవాలని పావులు కదుపుతోంది. జమ్ము కాశ్మీర్ పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, పెట్టుబడుల ఉపసంహరణ, ఈశాన్య రాష్ట్రాల అల్లర్లు తదితర అంశాలపై కూలంకషంగా చర్చలు జరగనున్నాయి. దీంతో పార్టీని అన్ని రంగాల్లో ముందుకు నడిపించే విధంగా నాయకత్వ పటిష్టతకు పార్టీ ప్రధాన దృష్టి కేంద్రీకరించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మార్పులపై చర్చలు సాగనున్నట్లు చెబుతున్నారు

Narendra Modi

Narendra Modi

బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి యూపీఏ బలోపేతం కోసం ప్రయత్నించనుంది. బీజేపీ వ్యతిరేక పార్టీలను తమ కూటమిలో చేర్చుకోవడానికి వారిని ఆహ్వానించనున్నారు అక్కడి స్తానిక పరిస్థితులపై కూడా దృష్టి పెట్టి వారికి సహాయ సహకారాలు అందించాలని భావిస్తోంది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటంతో తమ బలం పెంచుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తోంది.

కాంగ్రెస్ పార్టీకి పోయిన అధికారం రావాలంటే నేతల్లో ఐకమత్యం ఉండాల్సిందే. అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉండాలి. పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీకి పునర్వైభవం దక్కేందుకు అందరు కష్టపడాలి. చింతన్ శిబిర్ లో ఇంకా కీలక నిర్ణయాలు తీసుకుని పార్టీని భవిష్యత్ లో గాడిలో పెట్టాలని చూస్తోంది. ఈ మేరకు తీర్మానాలు కూడా చేయాలని సూచిస్తోంది. మోడీనే టార్గెట్ చేసుకుని కాంగ్రెస్ ముందుకు సాగనుందని తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారానికి రాకుండా చేయడమే వారి ఉద్దేశంగా కనిపిస్తోంది.

Also Read: AP Government: రయ్..రయ్ కాన్వాయ్ కు డబ్బులు చెల్లించని ఏపీ సర్కార్

Tags

    follow us