Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly: ఆ నేతలను అసెంబ్లీలో అడుగు పెట్టనీయం... వైసీపీ అధిష్టానం భారీ స్కెచ్

AP Assembly: ఆ నేతలను అసెంబ్లీలో అడుగు పెట్టనీయం… వైసీపీ అధిష్టానం భారీ స్కెచ్

AP Assembly: కొరకరాని కొయ్యలుగా మిగులుతున్న టీడీపీ నేతలపై అధికార పార్టీ ప్రతీకారం తీర్చుకోనుందా? వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చూడాలని ప్రయత్నిస్తోందా? వారిని ఎలాగైనా అణచివేయాలని ప్రయత్నాలు మొదలు పెట్టిందా? అందుకు ఉత్తరాంధ్ర నుంచే కార్యాచరణ ప్రారంభించిందా? అంటే జరుగుతున్న పరిణామాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఉత్తరాంధ్రలో కింజరాపు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకటరావు, అశోక్ గజపతిరాజు, చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక నేతలుగా ఉన్నారు. ఇందులో కింజరాపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మిగతా నేతలు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. దాదాపు అందరూ వాయిస్ ఉన్న నేతలే. ఇందులో ఒక్క అచ్చెన్నాయుడే శాసనసభ్యుడిగా ఉన్నారు. మిగతా వారంతా మాజీలే.

Jagan

అచ్చెన్న అసెంబ్లీతో పాటు బయట అధికార పక్షంపై ఒంటి కాలితో లేస్తున్నారు. పార్టీ వాయిస్ ను గట్టిగానే వినిపిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. సీఎంతో పాటు మంత్రులు, ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు తరువాత అన్నీతానై వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం చంద్రబాబు శాసనసభకు రాకున్నా..టీడీపీకి ఉన్న కొద్దిపాటి సంఖ్యా బలంతో అధికార పార్టీతో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతున్నారు. ఇది సహజంగా సీఎం జగన్ తో పాటు అధికార పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అచ్చెన్నాయుడును తెగ్గొట్టాని తెగ ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అచ్చెన్న ప్రాతినిధ్యం వహిస్తున్న టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇన్ చార్జ్ దువ్వాడ శ్రీనివాస్ ను ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు.

Also Read: Pawan Kalyan: కాపుల ఐక్యత కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టి

నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల బాధ్యతలను అప్పగించారు. మరో నాయకుడు పేడాడ తిలక్ ను కళింగ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. శ్రీకాకుళం పార్లమెంటరీ వైసీపీ అధ్యక్షురాలు కిల్లి క్రుపారాణి అదే నియోజకవర్గానికి చెందిన వారు కావడంతో ఆమెను పిలిపించుకొని మరీ వచ్చే ఎన్నికల్లో అచ్చెన్నాయుడును ఓడించడానికి ఉన్న ఏ అవకాశాన్నీ విడిచిపెట్టొద్దని దిశ నిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. అచ్చెన్నను ఓడించడం మాట తరువాయి.. ముందు నేతల మధ్య సఖ్యత పెంచాలని టెక్కలి నియోజకవర్గ వైసీపీ శ్రేణులు అధిష్టానికి కోరుతున్నాయి.

శ్రీకాకుళం జిల్లాకు చెందిన మరో కీలక నేత కళా వెంకటరావును సైతం వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని వైసీపీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం అక్కడ గొర్లె కిరణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. దీంతో విజయనగరం జడ్పీ చైర్మన్, మంత్రి బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావును బరిలో దించడం ద్వారా కళాను మట్టి కరిపించాలని చూస్తున్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో బొత్స కుటుంబానికి మంచి పట్టు ఉంది. భొత్స ఝాన్సీ ఎంపీగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గం పరిధిలో ఎచ్చెర్ల లో ప్రత్యేక అనుచరగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అటు సామాజికవర్గం పరంగా తూర్పు కాపులు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో బొత్స కుటుంబానికి చెందిన వారైతే గట్టి అభ్యర్థి అవుతారని అధిష్టానం అంచనా వేస్తోంది. కళాను ఎదురెళ్ల గల ఆర్థిక, అంగ బలం వారికే ఉందని భావిస్తున్నారు. అదే జరిగితే ఎమ్మెల్యే కిరణ్ కుమార్ ఏ మేరకు సహకరిస్తారో చూడాల్సిందే.

AP Assembly
Kala Venkata Rao

విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతిరాజు విషయంలో కూడా వైసీపీ అధిష్టానం అదే పంథాలో వెళుతోంది. ఎట్టి పరిస్థితు ల్లో రాజు గారికి రాజకీయంగా పుల్ స్టాప్ పెట్టాలని భావిస్తొంది. దానికి కారణం లేకపోలేదు. విజయనగరం సంస్థానాధీశుడుగా ఉన్న అశోక్ గజపతిరాజు వేలాది ఎకరాల భూములు, విలువైన ఆస్తులు, విద్యా సంస్థలు కలిగి ఉన్న మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా ఉన్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వం చైర్మన్ స్థానంలో అశోక్ ఉండగా ఏం చేయాలేమని భావించింది. అందుకే ఆయన అన్న ఆనంద గజపతిరాజు కుమార్తె సంచయిత గజపతిరాజును తెరపైకి తెచ్చారు. దొడ్డిదారిన మాన్సాస్ ట్రస్ట్ చైర్ పర్సన్ గా నియమించారు. కానీ న్యాయస్థానంలో ఈ నియామకం చెల్లలేదు. దీంతో అశోక్ పై పగ పెంచుకున్న వైసీపీ ప్రభుత్వం రాజకీయంగా దెబ్బ కొట్టాలని నిశ్చయించుకుంది. అందుకే ఆయన రాజకీయ ప్రత్యర్థి , విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రఃస్వామిని అన్నివిధాలా ప్రోత్సహిస్తోంది. భవిష్యత్ రాజకీయాన్ని ఊహించి కోలగట్ల కుమార్తెను నగర డిప్యూటీ మేయర్ గా ఎంపిక చేసింది. వచ్చే ఎన్నికల్లో అశోక్ బరిలో దిగితే కోలగట్ల, అశోక్ కుమార్తె పోటీ చేస్తే కోలగట్ల కుమార్తె పోటీ చేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో అశోక్ గజపతిరాజు కుటుంబం రాజకీయంగా సమాధి చేయాలని తలపోస్తున్నారు.

విశాఖకు చెందిన నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడును ఎలాగైనా చెక్ చెప్పాలని భావిస్తున్నారు. ప్రభుత్వంతో పాటు సీఎం, మంత్రులపై అయ్యన్న వ్యక్తిగత విమర్శలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. రాష్ట్ర స్థాయిలో అయ్యన్న చేసిన వ్యాఖ్యలు దూమరం రేపిన సందర్భాలున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పదుల సంఖ్యలో కేసులు నమోదు కావడం ఆయన వ్యాఖ్యల దుమారమే కారణం.

అయినా అయ్యన్న వెనక్కి తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు విజయ్ ను బరిలో దింపాని చూస్తున్నారు. విజయ్ తండ్రి కంటే దూకుడు ప్రదర్శిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో అయ్యన్న వ్యతిరేకులను ఒక తాటిపై తీసుకు రావడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆయన కుటుంబసభ్యులను తమ వైపు తిప్పుకుంది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా పెట్ల ఉమాశంకర్ గణేష్ ఉన్నారు. ఈయన స్వయాన సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కు సోదరుడు. మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప, రుత్తల ఎర్రాపాత్రుడు తదితర నేతలను అధిష్టానం పిలిపించుకుంది. వచ్చే ఎన్నికల్లో అయ్యన్న బరిలో ఉన్నా.. ఆయన కుమారుడు పోటీచేసినా ధీటుగా ఎదుర్కోవాలని దిశ నిర్దేశం చేసింది.

Also Read: AP Cabinet Updates: జగన్ కేబినెట్ లో ఐదుగురు మహిళలకు చాన్స్.. రేసులో ఎవరంటే?

RELATED ARTICLES

Most Popular