ice cream : ప్రస్తుతం మార్చి నెలలోనే మనదేశంలో ఎండలు దంచి పడుతున్నాయి. మనతోపాటు ఆసియా ఖండంలో ఉండే థాయ్ లాండ్ ప్రాంతంలో కూడా ఎండలు భారీగానే ఉన్నాయి. ఉష్ణోగ్రతలు భారీగా నమోదు అవుతున్న నేపథ్యంలో అక్కడి ప్రజలు ఎండ వేడిమి కి తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఉష్ణోగ్రతలకు తోడుగా వేడి గాలులు వీస్తుండడం అక్కడి ప్రజలను ఇబ్బందికి గురిచేస్తోంది. ఈ క్రమంలో చల్లదనం కోసం అక్కడి ప్రజలు తపించి పోతున్నారు. సాయంత్రం పూట సముద్రపు బీచ్ లకు వెళ్తున్న ఆ దేశ ప్రజలు.. మధ్యాహ్న సమయంలో మాత్రం చల్లటి పానీయాలను తాగుతున్నారు. కొందరైతే ఐస్ క్రీం లను లాగించేస్తున్నారు. అలా ఐస్ క్రీమ్ తినడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి ఊహించని పరిణామం ఎదురైంది. దీంతో అతడు ఒకసారిగా షాక్ కు గురయ్యాడు.
Also Read : ట్రెండింగ్: ఐస్ క్రీం తో దోశ: షాక్ అవుతున్న నెటిజన్లు
ఐస్ క్రీమ్ లో అది కనిపించింది…
థాయ్ లాండ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఎండ వేడి తట్టుకోలేక ఐస్ క్రీమ్ కొనుగోలు చేశాడు. స్థానికంగా ఉన్న ఓ షాపులో అతడు తనకు నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కొనుక్కున్నాడు. ఎండ వేడిమిని ఢీకొట్టడానికి.. చల్లదనాన్ని ఆస్వాదించడానికి అతడు ఐస్ క్రీమ్ లాగించడానికి ప్రయత్నించడు.. ఐస్ క్రీమ్ కవర్ తీయగానే అతనికి వెంటనే గడ్డకట్టుకుపోయిన పాము కనిపించింది. ఆ ఐస్ క్రీమ్లో ఆ పాము అలా కనిపించడంతో కొనుగోలు చేసిన వ్యక్తికి ఒక్కసారిగా షాక్ తగిలింది. దానిని అతడు ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఈ సంఘటన అక్కడ చర్చనీయాంశం కావడంతో పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ” థాయిలాండ్ ప్రాంతంలో భరించలేని వేడి ఉంది. ఆ వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఓ వ్యక్తి ఐస్క్రీం కొనుగోలు చేశాడు. ఆ ఐస్ క్రీమ్ కవర్ తీయగానే అతడికి పాము కనిపించింది. వెంటనే అతడు భయపడిపోయాడు. దానిని తన ఫోన్లో ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త చర్చకు దారి తీసింది. పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఐస్ క్రీమ్ లో పాము రావడానికి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు కారణమైన ఐస్ క్రీమ్ తయారీదారుపై పోలీసులు కేసులు పెట్టారు. ఐస్క్రీం విక్రయించిన వ్యక్తిపై కూడా కేసులు నమోదు చేశారు. అయితే ఆ వ్యక్తికి పరిహారం ఇవ్వడానికి సదరు ఐస్ క్రీమ్ తయారీ కంపెనీ ముందుకు వచ్చినట్టు తెలుస్తోందని” థాయిలాండ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఐస్ క్రీమ్ తయారు చేస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉండటం వల్లే ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సదరు కంపెనీ ఇస్ క్రీమ్ విక్రయాలు పడిపోయినట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం పై ఆ కంపెనీ ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది
Also Read : అన్నం తిన్న తరువాత ఐస్ క్రీం తింటున్నారా?