Relationship: సృష్టిలో దాంపత్య జీవితం చాలా అందమైనది. ఇద్దరు తెలియని వ్యక్తులు ఒకరికొకరు తమ భావాలను పంచుకుంటూ ఉంటూ జీవితాంతం కలిసి ఉంటారు. అయితే ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొందరు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ముందుకు పయనిస్తారు. మరికొందరు మాత్రం చిన్న చిన్న విషయాలకే పెద్దగా నిరాశపడి ఒకరిపై ఒకరు దూషించుకుంటారు. దీంతో ఒక్కోసారి ఇద్దరు వ్యక్తులు విడిపోవాల్సి వస్తుంది. అయితే ఇటీవల కొందరు మానసిక శాస్త్రవేత్తలు తెలిపిన ప్రకారం భార్య భర్తల మధ్య కొన్ని విషయాలు ఎక్కువగా చర్చకు వచ్చినప్పుడు వీటిపై ఇద్దరు కోపం తెచ్చుకొని విడిపోతున్నట్లు పేర్కొంటున్నారు. అందువల్ల ఆ విషయాల గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మిగతా విషయాలపై దృష్టి పెట్టాలని వారి అంటున్నారు. మరి ఏ విషయాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా వస్తున్నాయి?
కొందరు పురుషులు భార్యను కేవలం ఒక తన అవసరం గానే భావిస్తారు. కానీ తన జీవితంలో తల్లి ఎలాగో ఆ తర్వాత భార్య కూడా అన్ని సేవలు చేస్తూ ఉంటుంది. అయితే ఈ విషయాన్ని ఆ భర్త ఎప్పటికప్పుడు గ్రహిస్తూ ఆమెను గౌరవిస్తూ ఉండాలి. అయితే కొందరు పురుషులు అనుకున్న దానికంటే వ్యతిరేకంగా ఆడవారు ఉన్నట్లయితే.. వారిని సరైన మార్గంలో నడిపించే బాధ్యత తీసుకోవాలి. అప్పటికీ మారానప్పుడు మానసిక నిపుణులను సంప్రదించడం అవసరం. కానీ కొందరు ఆడవాళ్లు గౌరవించినప్పుడు వారిని కూడా గౌరవిస్తూ.. కొన్ని విషయాలలో ఓర్చుకునే గుణాన్ని ఏర్పరచుకోవాలి.
చాలామంది దంపతులు వాళ్ల ఇద్దరి గురించి కాకుండా స్నేహితుల గురించి లేదా బంధువుల గురించి ఎక్కువగా చర్చిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒకరి కంటే ఒకరు గొప్ప అనే భావన కలుగుతుంది. దీంతో ఇద్దరు మధ్య గొడవ ప్రారంభమవుతుంది. అందువల్ల సాధ్యమైనంత వరకు బంధువుల గురించి తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయాలని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. భార్యాభర్తలు తమ జీవితం.. తమ పిల్లల జీవితం.. భవిష్యత్తులో వారు చేయబోయే పనుల గురించి ఎక్కువగా చర్చించుకోవాలని సూచిస్తున్నారు. ఇలా కార్య సమయంలో వారి మధ్య గొడవలు పెరిగి విడిపోయే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
ఇక చాలా మంది కపుల్స్ చేసే మూడో పొరపాటు ఏంటంటే ఒకరి గురించి ఒకరు తక్కువగా భావించడం. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఏ పని చేసినా ఇద్దరు సమానంగానే చేస్తారు. ఈ విషయాన్ని ఇద్దరు గ్రహించాలి. ఒకరికి ఒకరు తోడుగా ఉండి కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేయాలి. అంతేగాని ఒకరిపై ఒకరు పెత్తనం చూపించడం వల్ల ఎవరికి లాభం ఉండదు. అంతేకాకుండా ప్రతిరోజు మనశ్శాంతిని కోల్పోతూ ఉంటారు. ఇలా ఒకరిపై ఒకరు పెత్తనం చెలాయించిన వారు ఎక్కువ రోజులు కలిసి ఉండరని మానసిక నిపుణులు చెబుతున్నారు. అందువల్ల భార్యాభర్తలు ఈ విషయంపై ఎక్కువగా చర్చించుకోవద్దని చెబుతున్నారు. ఒకవేళ భార్య లేదా భర్త తన గురించి చెప్పినప్పుడు కాసేపు విని.. ఆ తర్వాత ఎదుటివారి చెప్పే విషయాన్ని గౌరవించాలని చెబుతున్నారు. అప్పుడే ఒకరిపై ఒకరికి గౌరవం పెరిగి అన్యోన్యంగా జీవించగలుగుతారు.