https://oktelugu.com/

Nirmala Sitharaman: పోటీచేయడానికి పైసలేవన్న నిర్మలమ్మ.. భయమా? పేదరికమా తల్లీ?

కేంద్ర ప్రభుత్వంలో కీలక పోర్టు పోలియోను నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు చెందిన నిర్మల సీతారామన్ బిజెపిలో సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చారు. బిజెపి అనుబంధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది.

Written By:
  • Dharma
  • , Updated On : March 28, 2024 / 05:25 PM IST

    Nirmala Sitharaman

    Follow us on

    Nirmala Sitharaman: ఏటా లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే ఆమె వద్ద డబ్బులు లేవట. పోటీ చేసేందుకు సైతం స్తోమత లేదట. అందుకే పోటీ చేయడం లేదట. పేదరికం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నారట. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఓ మీడియా సంస్థ చేసిన ఇంటర్వ్యూలో.. మీరెందుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని అడిగిన ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వింతగా ఉంది. సర్వత్రా ఆసక్తి రేపుతోంది. కేవలం డబ్బులు లేకపోవడం వల్లే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పడం విశేషం.

    కేంద్ర ప్రభుత్వంలో కీలక పోర్టు పోలియోను నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు చెందిన నిర్మల సీతారామన్ బిజెపిలో సుదీర్ఘకాలం పనిచేస్తూ వచ్చారు. బిజెపి అనుబంధ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఆమె సేవలను గుర్తించిన మోదీ తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కీలకమైన ఆర్థిక శాఖను అప్పగించారు. కోవిడ్ కష్టకాలంలో సైతం ఆర్థిక శాఖను బాగానే నిర్వర్తించారన్న పేరు నిర్మల సీతారామన్ కు ఉంది. ప్రస్తుతం ఆమె రాజ్యసభ సభ్యురాలుగా ఉంటూ కేంద్రమంత్రి పదవి నిర్వహిస్తున్నారు. పుట్టినిల్లు తమిళనాడు కాగా.. మెట్టినిల్లు మాత్రం ఆంధ్ర ప్రదేశ్.

    దేశవ్యాప్తంగా 400 పార్లమెంట్ స్థానాలను బిజెపి టార్గెట్ చేసుకుంది. బిజెపి సొంతంగా 370 పార్లమెంటు స్థానాలను, కూటమిపరంగా మరో 30 స్థానాలను దక్కించుకోవాలని భావిస్తోంది. అందుకే రాజ్యసభ సభ్యులను సైతం లోక్సభ సభ్యులుగా పోటీ చేయిస్తోంది. రాజ్యసభ సభ్యులైన పీయూష్ గోయల్, భూపేందర్ యాదవ్, రాజీవ్ చంద్రశేఖర్, మన్సుఖ్ మాండవియ, జ్యోతిరాదిత్య సింధియాలను లోక్సభ అభ్యర్థులుగా బిజెపి ప్రకటించింది. కానీ ఒక్క నిర్మల సీతారామన్ కు మాత్రం మినహాయింపు ఇచ్చింది. అయితే నిర్మలమ్మను సైతం బిజెపి హై కమాండ్ అడిగిందని.. పోటీ చేయాలని కోరినట్లు ఆమె స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ తిరస్కరించినట్లు చెప్పారు.

    అయితే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి తగిన ఆర్థిక వనరులు తన వద్ద లేవని నిర్మలా సీతారామన్ స్పష్టం చేయడం విశేషం. అటు పోటీ విషయంలో కూడా వేరే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. ఏపీలో అయినా.. తమిళనాడులో అయినా తాను పోటీ చేయడానికి అవకాశం ఉందని.. కానీ గెలుపు అంత సునాయాసం కాదని తేల్చేశారు. అక్కడ కుల,మత, వర్గాలు తెరపైకి వస్తాయని.. వీటన్నింటిని అధిగమించలేక తాను పోటీకి ముందుకు రాలేదని నిర్మలమ్మ తేల్చేశారు.