Tirumala: శ్రీవారి దర్శనానికి చిక్కులే ఎదురవుతున్నాయి. ఇన్నాళ్లు సాఫీగా సాగిన దర్శనం ఇప్పుడు ఎందుకు గొడవలమయమవుతోంది. భక్తులు క్యూలైన్లలో గంటల తరబడి వేచి చూసే పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ఎన్నడు కూడా తొక్కిసలాటలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు పరిస్థితిలో మార్పు కనిపిస్తోంది. భక్తుల నియంత్రణకు టీటీడీ చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగా తోపులాటలు జరుగుతున్నాయి. జనం కొండ కిందనే వేచి చూడాల్సిన అగత్యం ఏర్పడింది.

వేసవి సెలవులు రాకముందే నాలుగు రోజులుగా భక్తులు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దీంతో టోకెన్ల జారీ చేయకుండా అలాగే వదిలేశారు. దీంతో భక్తులు క్యూలైన్లలో బారులు తీరడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో భక్తులకు గాయాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. దీంతో భక్తులు టీటీడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియంత్రణ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Hyderabad Tree City: హైదరాబాద్ ట్రీ సిటీ.. కథేంటి?
దీంతో భక్తులు అధిక సంఖ్యలో రావడంతో కొందరు వెనుదిరిగి పోయినట్లు తెలుస్తోంది. కానీ శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో టీటీడీ నిర్లక్ష్యంపై భక్తుల్లో ఆగ్రహం వస్తోంది. ఇది ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేదిగా ఉందని తెలుస్తోంది. తిరుమలలో భక్తుల తొక్కిసలాట జరగడం అందరికి భయం కలిగిస్తోంది.
ఇప్పటికే జగన్ పై అనేక విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ వ్యవహారం కూడా ఆయన మెడకు చుట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ లో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపడితే బాగుంటుందనే వాదనలు భక్తుల నుంచి వస్తున్నాయి. భక్తుల సౌకర్యార్థం చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ మేరకు అప్రమత్తంగా వ్యవహరించి భక్తుల కోసం చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.

సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. కానీ వారి కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదు. దీంతో వారు తిరుమలకు వచ్చేందుకు జంకుతున్నట్లు తెలుస్తోంది. భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అధికార యంత్రాంగం ఏం చేస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. భక్తుల కోసం పనిచేయాల్సిన వారిపై ప్రభుత్వం ఎందుకంత ప్రేమ చూపిస్తోందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులతో పని చేయించేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Jagan New Cabinet: ఫస్ట్ టైం బతిమిలాడుతున్న జగన్.. ఎందుకో తెలుసా?
[…] […]