Doctor
Doctor : ఆ లేడీ డాక్టర్ కు ఈత కొట్టడం మహా సరదా. అందువల్లే సమీపంలో ఉన్న తుంగభద్ర నదిలో ఈతకు దిగింది. అయితే ఆ నీటి ప్రవాహంలో ఆమె కొట్టుకుపోయింది. చివరికి విగత జీవిగా మారింది. చనిపోయిన ఆల్ లేడి డాక్టర్ పేరు అనన్యరావు. హైదరాబాదులో ఓ టాప్ డాక్టర్ కుమార్తె ఈమె. అనన్యరావు మల్కాజ్ గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు దూరపు బంధువు అవుతారు. అనన్యరావు మృతి నేపథ్యంలో ఆమె కుటుంబంలో విషాదచాయలు అలముకున్నాయి. అనన్య తన స్నేహితులతో కలిసి కర్ణాటక రాష్ట్రంలోని హంపి విహారయాత్రకు వెళ్లారు. చిన్నప్పటినుంచి అనన్యకు ఈత అంటే మహా ఇష్టం. పైగా స్నేహితులు కూడా తోడు ఉండడంతో హంపి లోని తుంగభద్ర నదిలో దూకారు. అయితే కొంతసేపటికి ఆమె నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. వాస్తవానికి అనన్యకు ఈత అంటే చాలా ఇష్టం. పైగా తన స్నేహితులతో కలిసి రెండు రోజుల క్రితమే ఆమె పంపి వచ్చారు. హంపి ప్రాంతంలోని ఓ ప్రైవేట్ రిసార్టులో ఆమె స్నేహితులతో కలిసి ఉన్నారు. గత బుధవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత హంపి దగ్గరలో ఉన్న తుంగభద్ర నదిని చూసేందుకు ఆమె తన స్నేహితులతో కలిసి వెళ్లారు. ఇందులో భాగంగా నదిలో ఈత కొట్టాలని వారు అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనన్య 25 అడుగుల ఎత్తు ఉన్న బండ రాయి నుంచి తుంగభద్ర నదిలోకి దూకారు. కాసేపు ఆమె ఈత కొట్టారు. అయితే కొంతసేపటికే మరో ప్రాంతం నుంచి అలలు వచ్చాయి. దీంతో వాటి తాకిడికి అనన్య కొట్టుకుపోయారు. ఈ విషయాన్ని గమనించిన స్నేహితులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. మరోవైపు అనన్య తుంగభద్ర నదిలో దూకుతున్న దృశ్యాలను స్నేహితులు తమ ఫోన్లలో వీడియో తీశారు.
రెండు నిమిషాల పాటు ఈత కొట్టింది
అనన్య రెండు నిమిషాల పాటు తుంగభద్ర నదిలో ఈత కొట్టింది. అయితే ఆమెకు వ్యతిరేకంగా ఉన్న దిశలో తుంగభద్ర నది నుంచి అలలు వచ్చాయి. ఆ అలల తాకిడికి ఆమె కొట్టుకుపోయింది. ఆమె కొట్టుకుపోతున్నప్పుడు కాపాడాలని స్నేహితులు ప్రయత్నించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. ఎంతసేపటికి అనన్య జాడ కనిపించకపోవడంతో స్నేహితులు స్థానికంగా ఉన్న పోలీసులకు, అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని దాదాపు మూడు గంటల పాటు తుంగభద్ర నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి అనన్య మృతదేహాన్ని బయటకు తీశారు. అనన్య హైదరాబాదులో పేరు మోసిన ఓ వైద్యుడి కుమార్తె. తన తండ్రి లాగానే ఆమె కూడా వైద్య విద్య పూర్తి చేశారు. ఈ క్రమంలో తన స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లారు. విహారయాత్రలో అనుకోకుండా జరిగిన ప్రమాదం ఆమె ప్రాణాలు తీసింది. అంతేకాదు ఆ విహారయాత్రను విషాదయాత్రగా మార్చింది. అనన్య విగతజీవిగా ఇంటికి రావడంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు. మైనంపల్లి హనుమంతరావు దగ్గర బంధువు కావడంతో రాజకీయ నాయకులు సదరు డాక్టర్ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు.
#KoppalMishap #Sanapur
Video showing #AnanyaRao a doctor from #Hyderabad who jumped into the #Tungabhadra river on Tuesday went missing . Rescue operation has not yielded any results so far @NewIndianXpress @XpressBengaluru @Dir_Lokesh pic.twitter.com/Bsd0H9VnzA— Amit Upadhye (@AmitSUpadhye) February 19, 2025
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Hyderabad lady doctor who jumped to swim in the tungabhadra river was never seen again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com