Sugali Preeti case: అనేక కేసుల్లో బిజీగా ఉన్నాం.. పరిమితమైన వనరులు మాత్రమే మాకు ఉన్నాయి. అందువల్ల కేసును దర్యాప్తు చేపట్టలేం. అందువల్ల ఈ కేసును కొట్టేయాలి” మూడు రోజుల క్రితం సిబిఐ ఎస్పి రఘురామరాజన్ ఏపీ హైకోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు.. ఫలితంగా సుగాలి ప్రీతి కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. సుగాలి ప్రీతి కేసు వెలుగులోకి వచ్చినప్పుడు.. నాడు పవన్ కళ్యాణ్ ప్రతిపక్షంలో ఉన్నారు. ఈ కేసు కు సంబంధించి ఆయన అనేక కోణాలలో ప్రసంగించారు. ప్రభుత్వం, అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నలు కూడా సంధించారు. అంతేకాదు ప్రీతి కేసులో న్యాయం జరగాలని పోరాటం కూడా చేశారు. కర్నూలులో ధర్నాలు, ర్యాలీలు చేయడంతో ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది.. నాడు సుగాలి ప్రీతి తల్లి(ఆమె ఓ దివ్యాంగురాలు) జనసేన పార్టీ కార్యాలయానికి వచ్చి పవన్ కళ్యాణ్ ను కలిశారు.. నా బాధను చెప్పుకున్నారు.. ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తనకు న్యాయం చేయడం లేదని… మీరేనా నా కుటుంబానికి న్యాయం చేయాలని సుగాలి ప్రీతి తల్లి పవన్ కళ్యాణ్ ఎదుట కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ధర్నాలు చేశారు. ఆందోళన చేశారు. అర్థం గా ఆ కేసు సిబిఐ దాకా వెళ్ళింది.. కానీ ఇంతవరకు సుగాలి ప్రీతి తల్లికి న్యాయం జరగలేదు. పైగా తాము అధికారంలోకి వస్తే ముందు పరిష్కరించేది ఈ కేసునేనని నాడు పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి హామీ ఇచ్చారు..
నాడు పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..
” 14 సంవత్సరాల సుగాలి ప్రీతి అనే బాలిక బడికి వెళ్తే.. పదిమంది ఆమె జీవితాన్ని నాశనం చేస్తే అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి గురకరాయి తగిలితేనే రాష్ట్ర మొత్తం ఊగిపోయింది. సగటు మనిషి బాధను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సగటు మనిషి కన్నీళ్లను ఈ రాష్ట్రం గుర్తించడం లేదు. అసలు ఈ తప్పు మొత్తం జగన్మోహన్ రెడ్డిది అసలు కాదు. ముమ్మాటికి ప్రజలది. ప్రజలలో పౌరుషం అనేది చచ్చిపోయింది. దాస్యం చేయడం అలవాటుగా మార్చుకుంది. దానికంటే చనిపోవడమే మేలు” అని పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల ప్రచారంలో ఆవేశంగా ప్రసంగించారు. దానికంటే ముందు కూడా సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ ఆగ్రహంగా మాట్లాడారు. అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని విమర్శించారు.. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై కూడా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ” పోలీసులకు ఆడపిల్లలు లేరా? రాజకీయ నాయకులకు ఆడపిల్లలు లేరా? ప్రీతిని చంపేసిన ఆ వెదవలకు ఆడపిల్లలు లేరా” అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.
8 నెలలు దాటినా..
అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా టేక్ ఆఫ్ చేసే కేసు ఇదే అని పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి తల్లికి హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు దాటింది. ఇంతవరకు కేసు విషయంలో పురోగతి లేదు. అంతేకాదు ఆ కేసును ఏకంగా చెత్తబుట్టలో పడేసే పరిస్థితికి దిగజారిపోయింది. అసలు కేసును కొట్టివేయాలని సిబిఐ హైకోర్టును ఆశ్రయించింది. వాస్తవానికి ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలని ప్రీతీ తల్లిదండ్రులు 2020 సెప్టెంబర్ 11న హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.. అయితే దీనిపై పూర్తిస్థాయిలో వివరాలు సేకరించి కౌంటర్ దాఖలు చేయాలని సిబిఐ ని హైకోర్టు ఆదేశించింది. ఇక్కడ సీన్ కట్ చేస్తే సిబిఐ ఎస్పీ రఘురామరాజన్ ఫిబ్రవరి 13న హైకోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ప్రీతి కేసులో తాము జోక్యం చేసుకోవాల్సిన సంక్లిష్టత లేదని.. ఇదే విషయాన్ని సిబిఐ ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని ఆయన వెల్లడించారు.. తాము దర్యాప్తు చేయాల్సిన కేతులు చాలా ఉన్నాయని రఘురామరాజన్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.. అంతేకాదు సుగాలి ప్రీతి తల్లి హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని ఆయన అందులో పేర్కొన్నారు.. మరి ఈ కేసు పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తాం అనేది చూడాల్సి ఉంది.