Hyderabad Gang Rape- Political Row: తెలంగాణలో దేశంలో ఎక్కడ రేప్ జరిగినా.. మైనర్లపై దాడి జరిగినా.. ఒక వర్గానికి చిన్నపాటి అవమానం జరిగిన మీడియా ముందుకు వచ్చి గొంతు చించుకునే తెలంగాణలోని కొన్ని గొంతులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున రుమేనియాకు చెందిన ఓ మైనర్ బాలిక గ్యాంగ్‌రేప్ అయితే మాత్రం మూగబోయాయి. ట్విట్టర్ పిట్టలు గూట్లో కనిపించడం లేదు. వీరి మౌనం.. నేరాన్ని పరోక్షంగా అంగీకరిస్తున్నారన్న సంకేతం ఇస్తున్నా.. అమానవీయ సంఘటనను కనీసం ఖండించకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొన్నటి వరకు రాష్ట్రానికే పరిమితమైన ఈ ఘటనను బీజేపీ ఇప్పుడు జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. అయినా.. రాష్ట్రానికి తండ్రి లాంటి ముఖ్యమంత్రి దీనిపై ఒక్క ప్రకటన చేయడం లేదు. కనీసం చర్యలకు కూడా ఆదేశించలేదు. ఇక ఆయన కూతురు.. దేశ నేతలు రాష్ట్రనికి వచ్చినప్పుడు ట్విట్టర్‌లో ప్రశ్నించే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కనిపించకుండా పోయారు. రాష్ట్రంలో ముఖ్యమైన మంత్రి.. సీఎం కేసీఆర్ తనయుడు చర్యలకు ఆదేశించి పిట్టగూట్లో పత్తా లేకుండా పోయారు. ఈ నేపథ్యంలో కావాలనే వీరంతా మౌనం పాటిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

చర్లబడే వరకూ స్పందించకూడదని..
గ్యాంగ్‌రేప్ ఘటన రెండు రోజుల తర్వాత అంతా చల్లబడుతుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు. అప్పటి వరకూ ఎవరూ స్పందించకపోవడమే మంచిదన్న అభిప్రాయంలో వారు ఉన్నట్లు తెలిసింది. పాలకుల మౌనంతో దేశం కాని దేశం వచ్చి కామాంధుల చేతిలో చిదిమేయబడిన బాలికకు న్యాయం మాత్రం జరిగే అవకాశం కనిపించడం లేదు.
Also Read: Hyderabad Gang Rape Case: పోలీసులకు అగ్ని పరీక్ష.. బీజేపీ చేతిలో గ్యాంగ్‌రేప్ ఆధారాలు!!
నిబంధనలు గాలికి..
కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో పబ్బు గబ్బు పెరుగుతోంది. నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం లేదు. రాజకీయం ఒత్తిడితో నిబంధనలు ఉల్లంఘించిన పబ్బులకు ఒకటి రెండు రోజుల్లోనే తిరిగి అనుమతి ఇస్తున్నారు. ఇటీవల ఓ పబ్బులో డ్రగ్స్ కేసులో ప్రముఖులు, వారి పిల్లలు పట్టుబడ్డారు. ఒకటి రెండు రోజులు హడావుడి తర్వాత అంతా సైలెంట్ అయింది. తర్వాత ఓ మోటల్‌లో నిబంధనలకు విరుద్ధంగా పబ్బు నిర్వహిస్తున్నట్లు అధికారులు సీజ్ చేశారు. తర్వాత 24 గంటల్లోనే దానిని తిరిగి లె రిచారు. మైనర్లను పబ్బుల్లోకి అనుమతించొద్దన్న నిబంధన ఉన్నా.. ఎవరూ పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా నిర్వాహకులే మైనర్ల పార్టీకి అనుమతి ఇవ్వడం, అయినా పాలకులు, అధికారులు చర్య తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
బాధితురాలి బతుకు ఆగమే..
తప్పు ఎవరు చేసినా ప్రతిపక్షం, మీడియా ప్రశ్నించాలి. అప్పుడే బాధితులకు న్యాయం జరుగుతుంది. కానీ ప్రశ్నించే వారినే తప్పు పడుతున్న తెలంగాణ పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది. బాధితురాలికి న్యాయం చేయడం కంటే పోలీసులు నిందితులను తప్పించడంపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. విచారణ జరుపకుండానే ప్రముఖుల పిల్లలకు క్లీన్‌చిట్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఇక అధికార పార్టీ నేతల ఒత్తిడి పోలీసులపై తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితిలో బాధితురాలికి న్యాయం జరుగుతుందన్న ఆశ మచ్చుకైనా కనిపించడం లేదు.

ప్రశ్నించేవారినే తప్పు పడుతున్న పోలీసులు ..
గ్యాంగ్ రేప్ జరిగి ఐదు రోజులు అయినా.. తెలంగాణలో పోలీసింగ్ పత్తాలేకుండా పోయింది. లక్షల సీసీ ఎమెరాలు, కమాండ్ కంట్రోల్ ఉన్న రాజధాని నగరంలో ఒక్క ఆధారాన్నీ తెలంగాణ పోలీసులు కనిపెట్టలేకపోవడంతో చాలా రోజుల తర్వాత మీడియా, ప్రతిపక్ష పార్టీలు బాధితురాలి పక్షాన నిలిచాయి. అయితే ప్రతిపక్షాన్ని అణచివేసిన పాలకులున్న ఈ రాష్ట్రంలో బాధితురాలి పక్షాన నిలవాల్సిన పోలీసులు ఖాసీం రజ్వీ సైన్యంలా ప్రవర్తిస్తున్న తీరు అనుమానాలకు తావిస్తోంది. ప్రశ్నించేవాడినే శిక్షించాలి అని పోలీసులు ఆలోచన చేస్తున్న తీరు ప్రజాస్వామ్యానికే తలవంపుగా మారే పరిస్థితి. ఈ నేపథ్యంలో మేధావులమని చెప్పుకునే పాలకులు ఎక్కడా కనిపిచంని వైనం మరింత బాధకలిగిస్తోంది. ధర్మం గురించి మాట్లాడి, ధర్మం పక్షాన నిలవాల్సిన పాలకుల గొంతులు ఎందుకు మూగబోయాయో అర్థంకాని పరిస్థితి.
Also Read:Yash And Prabhas: ప్రభాస్, యష్ లను కలిపిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ కు కన్నుల పండువ
[…] […]