Rana Daggubati: రానా మొహం చూపించుకోలేపోతున్నాడు… నెటిజెన్ కామెంట్ కి భల్లాలదేవ దిమ్మతిరిగే సమాధానం

Rana Daggubati: పలు కారణాల వలన విరాటపర్వం చాలా ఆలస్యమైంది. ఎప్పుడో 2021 సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో హీరోయిన్ సాయి పల్లవిని హైలెట్ చేస్తున్నారు. చిత్ర ట్రైలర్ రిలీజ్ ప్రకటన పోస్టర్ లో రానా, సాయి పల్లవి కౌగిలించుకొని ఉన్న పోస్టర్ విడుదల చేశారు. రానా పేస్ మాత్రం పోస్టర్ లో కట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ వివాదాస్పద కామెంట్ […]

Written By: Shiva, Updated On : June 4, 2022 6:28 pm
Follow us on

Rana Daggubati: పలు కారణాల వలన విరాటపర్వం చాలా ఆలస్యమైంది. ఎప్పుడో 2021 సమ్మర్ కానుకగా విడుదల కావాల్సిన ఈ చిత్రం జూన్ 17న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ విషయంలో హీరోయిన్ సాయి పల్లవిని హైలెట్ చేస్తున్నారు. చిత్ర ట్రైలర్ రిలీజ్ ప్రకటన పోస్టర్ లో రానా, సాయి పల్లవి కౌగిలించుకొని ఉన్న పోస్టర్ విడుదల చేశారు. రానా పేస్ మాత్రం పోస్టర్ లో కట్ చేశారు. దీనిపై ఓ నెటిజన్ వివాదాస్పద కామెంట్ చేశాడు. కించపరిచేలా ఉన్న ఆ కామెంట్ కి రానా బాగా సమాధానం చెప్పాడు. హుందాతో కూడిన రానా కామెంట్ కి ప్రశంసలు దక్కుతున్నాయి.

Rana Daggubati

ఇంతకీ ఆ నెటిజెన్ ఏం కామెంట్ చేశాడంటే… ”సొంత బ్యానర్ లో మూవీ చేస్తూ రానా కనీసం ముఖం చూపించుకోలేకపోతున్నాడు. ఇతర హీరోల సినిమాల్లో చిన్న చిత్ర పాత్రలు, విలన్ రోల్స్ చేయడం వలెనే ఈ పరిస్థితి వచ్చింది” అని కామెంట్ చేశారు. ఎవరికైనా చిర్రెత్తించే ఈ కామెంట్ కి రానా మాత్రం చాలా కూల్ గా చురకంటించాడు. మనం తగ్గి కథను, హీరోయిన్ ని ఎలివేట్ చేస్తే ఆ కిక్కే వేరు బ్రదర్, సొంత బ్యానర్ లో మాత్రమే ఇలాంటి గొప్ప పనులు చేయగలం… అంటూ సమాధానం చెప్పాడు.

Also Read: Nandamuri Taraka Ratna: ఎన్టీఆర్ పై నందమూరి ఫ్యామిలీ కుట్ర… తారక రత్న ఏమన్నాడు!

Rana Daggubati

రానా పరిపక్వతతో కూడిన సమాధానానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఓ నెగిటివ్ కామెంట్ పై ఆయన స్పందించిన తీరు చాలా బాగుంది అంటున్నారు. ఇక విరాటపర్వం మూవీ ట్రైలర్ జూన్ 5న కర్నూలులో ఘనంగా లాంచ్ చేయనున్నారు. ఈ మూవీలో రానా నక్సల్ గా కనిపించనున్నారు. పీరియాడిక్ ఎమోషనల్ లవ్ అండ్ రెవల్యూషన్ డ్రామాగా తెరకెక్కుతుంది. నటి ప్రియమణి భారతక్క అనే లేడీ నక్సల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రానికి వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.

Also Read:Yash And Prabhas: ప్రభాస్, యష్ లను కలిపిన ప్రశాంత్ నీల్.. ఫ్యాన్స్ కు కన్నుల పండువ

Recommended Videos:


Tags