కరోనా విజృంభణ.. హడలిపోతున్న హైదరాబాదీలు

తెలంగాణలో కరోనా మహమ్మరి చాపకింద నీరులా విజృంభిస్తోంది. లాక్డౌన్లో ఒక్క కేసు కూడా లేని జిల్లాల్లో సైతం భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన రెకేత్తిస్తోంది. ఆన్ లాక్ 2.0లో రికార్డు స్థాయిలో కేసులు పెరిగిపోతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న ఆచరణలో సాధ్యంకావడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా? తెలంగాణ సీఎం అధికారిక నివాసం […]

Written By: Neelambaram, Updated On : July 4, 2020 3:05 pm
Follow us on


తెలంగాణలో కరోనా మహమ్మరి చాపకింద నీరులా విజృంభిస్తోంది. లాక్డౌన్లో ఒక్క కేసు కూడా లేని జిల్లాల్లో సైతం భారీగా కేసులు నమోదవుతుండటం ఆందోళన రెకేత్తిస్తోంది. ఆన్ లాక్ 2.0లో రికార్డు స్థాయిలో కేసులు పెరిగిపోతుంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్న ఆచరణలో సాధ్యంకావడం లేదని వాదనలు విన్పిస్తున్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు.

జగన్ ను విమర్శించాలన్న.. పొగాడాలన్న.. అతడేనా?

తెలంగాణ సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్లోనూ కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం తెల్సిందే. దీనిని బట్టి రాష్ట్రంలో కరోనా ఏవిధంగా విజృంభిస్తుందో అర్థం చేసుకోవచ్చు.లాక్డౌన్ సడలింపులకు ముందుగా రాష్ట్రంలో కరోనా కొంతమేర కట్టడిలోనే ఉంది. లాక్డౌన్లో ప్రభుత్వం కోల్పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు భారీగా సడలింపులు ఇచ్చింది. దీంతో కరోనా వ్యాపించేందుకు అవకాశం దొరికింది. ప్రస్తుతం ఉన్న ఆన్ లాక్ 2.0లో కేసులు రోజుకు వేలల్లో నమోదవుతూ ఉన్నాయి. ప్రధానంగా జీహెచ్ఎంసీ ప్రాంతం ప్రమాదకర స్థితిలోకి వెళ్లిందనే అభిప్రాయం నగరవాసుల్లో వ్యక్తమవుతోంది.

ఇప్పటికే జీహెచ్ఎంసీ కార్యాలయంతోపాటు పలు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పోలీస్, వైద్య, పారిశుధ్య కార్మికులు కరోనా బారినపడి మృతిచెందుతోన్నారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతోన్నారు. అయినప్పటికీ కరోనా మహమ్మరి ఎవరి నుంచి ఎలా వస్తుందోనని భయాందోళన ప్రతీఒక్కరిలో నెలకొంది. గడిచిన మూడురోజులుగా తెలంగాణలో వెయ్యికిపైగా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 1,892 కేసులు నమోదుయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం.

సీఎం జగన్ కు ముద్రగడ లేఖ.. వెనకున్నదేవరు?

తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందనే నగరవాసులు విమర్శిస్తున్నారు. దీంతో నగరంలోని పలు వ్యాపార సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నారు. వ్యాపారులు మూసివేయడం వల్ల తమకు నష్టం జరిగినా వినియోగదారుల శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వ్యాపార సంఘాల నేతలు ప్రకటించారు. వీరి బాటలోనే నగరంలోని పలు వ్యాపార సంఘాలు నడుస్తున్నాయి. దీంతో ప్రభుత్వమే సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ఆవిధమైన ఆలోచన చేసినప్పటికీ చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు రాష్ట్రంలో కేసులు సంఖ్య ఇంత వేగంగా పెరుగుతున్న ప్రభుత్వం మాత్రం నెపాన్ని ప్రజలపై, కరోనా టెస్టులు చేసే ప్రైవేట్ ల్యాబులపై నెట్టివేయడం శోచనీయంగా మారింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న మరణాల సంఖ్య ఆ స్థాయిలో లేకపోవడం తెలంగాణవాసులకు కొద్దిగా ఊరటనిచ్చే అంశంగా కన్పిస్తుంది. సీఎం కేసీఆర్ ఇప్పటికైనా ప్రజారోగ్యంపై దృష్టిసారించాలని నగరవాసులు కోరుతున్నారు.