Huzurabad by-poll:హుజూరాబాద్ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంలో చేపట్టిన ఈ ఓట్ల లెక్కింపులో మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించారు. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్ లాంటి వరాలు ప్రకటించడంతో ఉద్యోగులంతా కేసీఆర్ కే జై కొట్టారు.పోస్టల్ బ్యాలెట్ లో టీఆర్ఎస్ ఆధిక్యం సంపాదించింది.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటివరకూ రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్లు లెక్కించారు. అందులో ఉద్యోగులు టీఆర్ఎస్ కే ఎక్కువ ఓట్లు వేశారు.
ఇక తొలి రౌండర్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. ఆయన 166 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కు 4444, బీజేపీ 4610 ఓట్లు, కాంగ్రెస్ 119 ఓట్లు వచ్చాయి. దీంతో తొలి రౌండ్ లో బీజేపీ అభ్యర్థి ఈటలకు 166 ఓట్ల ఆధిక్యం లభించింది.
ఇక హుజూరాబాద్ లో రెండో రౌండ్ లోనూ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు ఆధిక్యం లభించింది. టీఆర్ఎస్ టఫ్ ఫైట్ ఇస్తున్నా 100 నుంచి 200 ఓట్ల మెజార్టీని ఈటల రాజేందర్ సాధిస్తున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి 358 ఓట్ల మెజార్టీతో ఈటల రాజేందర్ ఉన్నారు.
-బద్వేలులో వైసీపీ హవా
బద్వేలు ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ హవా కొనసాగుతోంది. మూడో రౌండ్ ముగిసేసరికి ఆ పార్టీ అభ్యర్థి దాసరి సుధ 24979 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మూడో రౌండ్ లో వైసీపీకి 10184 ఓట్లు రాగా.. బీజేపీకి 2305 ఓట్లు, కాంగ్రెస్ 598చ ఓట్లు, నోటాకు 393 ఓట్లు పోలయ్యాయి. మూడో రౌండ్ లో వైసీపీకి 7879 ఓట్ల ఆధిక్యం లభించింది.