Balakrishna: నందమూరి బాలకృష్ణ అందరిని ఆశ్చర్య చకితులను చేశాడు. అసలు బాలయ్య ఏమిటి ? ఒక టాక్ షోకి హోస్ట్ చేయడం ఏమిటి ? మొదటిసారి ఈ వార్త వచ్చినప్పుడు ఎవరూ నమ్మలేదు. కానీ అల్లు అరవింద్ ఒక ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి.. ఆ వేదిక పైకి బాలయ్యను పట్టుకొచ్చి.. ‘అన్ స్టాపబుల్’ అంటూ బాలయ్య పై నాలుగు బిల్డప్ షాట్స్ తీయించి స్టిల్స్ గా సోషల్ మీడియాలో వదిలారు.

అరవింద్ ఏమిటి బాలయ్యతో షో చేయడం ఏమిటి ? ఈ షో డిజాస్టర్ అవుతుంది. బాలయ్య పై షో చేస్తే ఎవరు చూస్తారు ? ఇలా సాగాయి కామెంట్లు. ఇక షోలో బాలయ్య హడావిడి చూసి అందరూ నవ్వారు. దీనికితోడు ఎప్పటిలాగే బాలయ్య తనకు అలవాటు అయిన స్పీచులు వదిలారు. అవి ఎప్పటిలాగే గందరగోళంగా సాగడంతో ఎక్కువగా ట్రోల్ అయ్యాయి.
మొత్తమ్మీద బాలయ్య షో నవ్వులపాలు అవుతుంది అనుకున్నారు. కట్ చేస్తే.. సీన్ రివర్స్ అయింది. బాలయ్య దెబ్బకు యూట్యూబ్ కూడా షేక్ అవుతుంది. ట్రేడింగ్ వన్, టు ప్లేస్ ల్లో ‘అన్ స్టాపబుల్’ ప్రోమో వైరల్ అవుతూ వస్తోంది. ఇది బాలయ్య క్రేజ్ అంటే.. అంటూ ఆయన ఫ్యాన్స్ సరదాగా సోషల్ మీడియాలో జై బాలయ్య అంటూ నినాదాలు అందుకున్నారు.
అయితే యాంటీ ఫ్యాన్స్ మాత్రం దీన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలయ్య హోస్ట్ చేస్తోన్న షో హిట్ అవ్వకూడదు అంటూ ప్రచారం చేస్తున్నారు. ఏది ఏమైనా బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ షోకి ప్రేక్షకులతో పాటు సినీ ప్రముఖులను కూడా సర్ప్రైజ్ చేసింది. ముఖ్యంగా బాలయ్య హోస్ట్ గా అదిరిపోయాడు. ప్రశ్నలు అడిగేది బాలయ్య కాబట్టి.. ఎదుట వ్యక్తి ఎంత ప్రముఖుడు అయినా సమాధానం చెప్పాల్సి వస్తుంది
Also Read: Varudu Kaavalenu: వరుడు కావలెను ఎక్స్ క్లూజివ్ కలెక్షన్స్ !
ఇక ఈ షో మొదటి ఎపిసోడ్ లో మోహన్ బాబుతో పాటు మంచు లక్ష్మి, మంచి విష్ణు కూడా పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్ లో బాలయ్య మోహన్ బాబును అడిగిన ప్రశ్నలు చాలా బోల్డ్ గా ఉండబోతున్నాయి. నేటి యూత్ కి తగ్గట్టు బాలయ్య క్రేజీ ప్రశ్నలు అడిగాడని టాక్ నడుస్తోంది. అలాగే మోహన్ బాబు కూడా మిగిలిన హీరోల పై చేసిన కామెంట్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయట.
Also Read: Anupama Parameswaran: రౌడీ బాయ్స్ మూవీ కోసం హద్దుమీరుతున్న అనుపమ…