మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని సింగ్రౌలి జిల్లాలోని మాడా గ్రామంలో భార్య (Wife), భర్త (Husband) నివాసం ఉంటున్నారు. వారికి పెళ్లయి పిల్లలున్నారు. సంసారం కూడా సాఫీగా సాగిపోతున్న సమయంలో ఒక్కసారిగా కలతలు రేగాయి. భార్య మరొకరితో చనువుగా ఉండడం గమనించాడు భర్త. ఇది పద్దతి కాదని, పిల్లలు పెద్దవారు అవుతున్నారని వారి ముందు మనం తల దించుకునేలా ప్రవర్తించకూడదని చెప్పాడు. అయినా ఆమెలో మార్పు కనిపించలేదు.
భార్యలో మార్పు రాకపోవడంతో భర్త రగలిపోయాడు. ఓసారి భార్యను చితకబాదాడు. అయినా ఆమె పద్దతిలో మార్పు లేదు. దీంతో ఆమె బయటకు వెళ్లకుండా కాపలా ఉండడం మొదలుపెట్టాడు. అయినా ఏదో ఒక సమయంలో బయటకు వెళ్తూ ప్రియుడిని కలిసి వస్తోంది. దీంతో ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన భర్త భార్యకు బుద్ది చెప్పాలని చూశాడు. ఆమెను చంపితే జైలు శిక్ష పడుతుందని భావించి ఏదైనా చేయాలని ఆలోచించాడు.
ఇద్దరు కలుసుకోకుండా మర్మాంగానికి కుట్టు వేయడమే కరెక్ట్ అని అనుకున్నాడు. దీంతో ఆమె నిద్ర పోతున్న సమయంలో గట్టిగా అదిమిపట్టి సూది దారంతో కుట్లువేసి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. అయితే, భర్త ఇంత దారుణానికి పాల్పడిన ఆ భార్య మాత్రం ఇంకా ప్రేమ చూపించడం విశేషం. తన భర్తపై కఠినచర్యలు తీసుకోకుండా దేహశుద్ధి చేసి వదిలేయాలని ఆ మహిళ పోలీసులను కోరినట్లు తెలిసింది. పోలీసులు అతని కోసం గాలిస్తున్నామని ఏసీపీ అనిల్ సోంకర్ పేర్కొన్నారు.