APEPDCL Recruitment 2021: ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. 398 ఎనర్జీ అసిస్టెంట్ల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీ నుంచి ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. https://apeasternpower.com/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది.
ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. వరుసగా రిలీజవుతున్న జాబ్ నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగులకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. గ్రామ, వార్డు సచివాలయాల కింద వివిధ జిల్లాల్లో పనిచేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజైంది. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏ సందేహాలు ఉన్నా వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లు రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఎంపిక చేసిన చోట విధులు నిర్వహించాలి. ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరే విధంగా జాబ్ నోటిఫికేషన్లను విడుదల చేస్తుండటం గమనార్హం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే.
అభ్యర్థులను వెబ్ సైట్ ను చెక్ చేసుకోవడం ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన ఇతర వివరాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు మేలు జరగనుంది.