Homeజాతీయ వార్తలుEPF Interest Rate: పేదోడిని కొట్టేది.. పెద్దోళ్లకు పంచడానికా.. ఈపీఎఫ్‌ వడ్డీ రేటు తగ్గింపులో ఆంతర్యం...

EPF Interest Rate: పేదోడిని కొట్టేది.. పెద్దోళ్లకు పంచడానికా.. ఈపీఎఫ్‌ వడ్డీ రేటు తగ్గింపులో ఆంతర్యం ఏమిటి?

EPF Interest Rate: ఎప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌).. చిన్న కార్మికులు చేసుకునే పొదుపు ఇది. దీనిని కార్మికులు అత్యవసర సమయాల్లో ఉపయోగించుకుంటారు. వేతనం నుంచి నెలనెలా పొదుపు చేసే ఈ నిధులపై కేంద్రం వడ్డీ చెల్లిస్తుంది. ఈ వడ్డీ కూడా ఊరికే ఏం కాదు. ఈ నిధిని కేంద్రం ప్రైవేటు సంస్థలకు అప్పులుగా ఇస్తుంది. షేర్‌ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంది. దీని ద్వారా లాభాలు వస్తాయి. దాని ఆధారంగానే కార్మికుల భవిష్య నిదికి వడ్డీ చెల్లిస్తుంది. కానీ కేంద్రం కొన్నేళ్లుగా కార్మికులకు ఇచ్చే వడ్డీ తగ్గిస్తోంది. దీనితో భవిష్య నిధి.. భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

EPF Interest Rate
EPF Interest Rate

కేంద్ర ప్రభుత్వం మరోసారీ ఎప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌) వడ్డీరేటును భారీగా తగ్గించింది. ఈసారి వడ్డీ రేటును 8.1 శాతానికి కుదించింది. ఈపీఎఫ్‌ అంటే సాధారణ కార్మికులు ఉద్యోగులు చేసుకునే పొదుపు. తమ కష్టార్జితంలో కొంత దాచుకుంటారు. ఇది ప్రభత్వాలు, ప్రైవేటు మార్కెటలో ఉంటుంది. వాటి ద్వారా వచ్చే ఆదాయన్ని సేవింగ్స్‌పై వడ్డీగా కేంద్రం చెల్లిస్తుంది. ఇప్పుడు వడ్డీ తగ్గించడం వలన సేవింగ్స్‌పై ఆదాయం తగ్గుతుంది.

Also Read: Pothina Mahesh- Sajjala Ramakrishna Reddy: ప్రముఖ యాంకర్‌కు ఆడికారు గిఫ్ట్‌.. ‘సజ్జల’ బాగోతం బయటపెట్టిన మహేశ్‌!!

ఎనిమిదేళ్లుగా తగ్గింపే..
దేశంలో మొత్తంగా 5 కోట్ల మంది ఈపీఎఫ్‌ ఖాతాదారులు ఉంటారు. వీరి సేవింగ్స్‌పై వడ్డీ తగ్గించడం వలన వారి జీవిత కాల ఆదాయంపై తీవ్ర ప్రభావం పడుతుంది. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయినప్పటి నుంచి ఈపీఎఫ్‌ వడ్డీ రేటు తగ్గుతూ వస్తోంది. 2015–16 8.8 శాతం ఉన్న వడ్డీని 8.6 కు తగ్గించారు. తర్వాత దీనిని 8.55కి తగ్గించారు. 2019–20 ఆర్థిక సవంత్సరంలో వడ్డీ రేటును 8.5కి తగ్గించారు. తాజాగా 2021–22 సంవత్సరానికి 8.1 కు తగ్గించారు. 2015–16 నుంచి 2019–2020 వరకు 0.3 శౠతం తగ్గించగా, ఇప్పుడు ఒకేసారి 0.4 శాతం తగ్గించారు.

EPF Interest Rate
EPF Interest Rate

రిజర్వ్‌ బ్యాంకు వడ్డీ పెంచుతుంటే..
ఒకవైపు రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను పెంచుతూ వస్తోంది. మూడు నెలల వ్యవధిలో వరుసగా రెండుసార్లు వడ్డీ రేటు పెంచింది. ద్రవ్యోల్బణం తగ్గిండాచడానికి ఇదొక్కటే మార్గమని పేర్కొంటోంది. కేంద్రం మాత్రం వడ్డీ రేటు తగ్గిస్తోంది. దీంట్లో ఆంతర్యం అర్థ కావడం లేదు. వడ్డీ పెంచడం అంటే అప్పులు తీసుకునేవారికి అధిక వడ్డీ వేయడం. ఈపీఎఫ్‌ నుంచి రుణాలు ఇస్తున్న కేంద్రం అధిక వడ్డీ తీసుకుంటూ కార్మికుల సేవింగ్స్‌పై తగ్గించడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదెక్కడి ఆర్థిక నీతి అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

కార్పొరేట్‌ సంస్థలకు మినహాయింపు..
కార్పొరేట్‌ సంస్థలకు ఇస్తున్న రుణాలపై వడ్డీ రాయితీ ఇస్తున్న కేంద్రం, కార్మికులకు ఇచ్చే వడ్డీని తగ్గించడం ఏమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కార్పొరేట్‌కు ఇచ్చే రాయితీతో సంస్థల ఆదాయం పెరుగుతుంది. కార్మికుల వడ్డీ తగ్గిస్తే వారి ఆదాయం తగ్గిపోతుంది. కేంద్రం చెల్లిస్తున్న వడ్డీలతో పోల్చితే కార్మికులకు ఇచ్చే వడ్డీ పెద్ద భారమే కాదు. కానీ కేవలం 5 కోట్ల కార్మికుల ఆదాయానికి గండి కొట్టడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Also Read:Pawan Kalyan Former Look: ఈ లుక్ చాలు పవన్ కళ్యాణ్ ఎంత రైతు పక్షపాతో తెలిస్తుంది!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular