Allu Arjun: అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా స్టార్. పుష్ప సినిమాతో ఆయన బ్రాండ్ మరింత పెరిగింది. దీంతో ఆయన వాణిజ్య ప్రకటనలకు అంబాసిడర్ గా మారడంతో కొన్ని ప్రకటనల్లో నటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇటీవల విడుదలైన ఫలితాల ప్రకటన కోసం శ్రీ చైతన్య కళాశాల తరఫున ఓ యాడ్ లో నటించాడు. కానీ అందులో చెప్పినవన్ని అబద్దాలే అని సామాజిక కార్యకర్త కొత్త ఉపేందర్ రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. శ్రీ చైతన్య కళాశాల, అర్లు అర్జున్ పై కేసులు నమోదు చేయాలని పేర్కొన్నాడు.

జూన్ 6న విడుదలైన ఐఐటీ, ఎన్ఐటీ ఫలితాల్లో శ్రీ చైతన్య ప్రభంజనం సృష్టించిందని చెబుతూ ప్రజలను పక్కదారి పట్టించేలా వాణిజ్య ప్రకటనలు చేసిన అల్లు అర్జున్ పై చర్యలు తీసుకోవాలని కోరాడు. వాణిజ్య ప్రకటనలపై విమర్శలు రావడం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటి కేసులు వచ్చినా ఇప్పుడు మాత్రం కేసు బలంగా ఉండటంతో అర్జున్ ఏం చేస్తారో కూడా తెలియడం లేదు. ఈ నేపథ్యంలో శ్రీచైతన్య, అల్లు అర్జున్ ఏం చర్యలు తీసుకుంటారో అర్థం కావడం లేదు.
Also Read: Nayantara – Vignesh: పెళ్లి రోజు తమ గొప్ప మనసుని చాటుకున్న నయనతార – విగ్నేష్ దంపతులు
ప్రకటనలో ఇచ్చిన సమాచారం పూర్తిగా అవాస్తవం. తప్పుడు ప్రకటనలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆ ప్రకటనతో ప్రజలను తప్పు దోవ పట్టిస్తున్నారని విమర్శిస్తున్నాడు. వాణిజ్య ప్రకటనల్లో తప్పుడు సమాచారమిస్తూ అందరిని మోసం చేస్తున్న యాజమాన్యంతో పాటు అందుకు సహకరించిన అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేయాలని ఆయన చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

పుష్స సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ తో వాణిజ్య ప్రకటనలకు ఒప్పించి దేశవ్యాప్తంగా పేరు సంపాదించాలని చూస్తున్న కళాశాల యాజమాన్యం ప్రజలను తప్పుదారి పట్టించి వారి నుంచి డబ్బులు దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ పై కేసు నమోదు కావడం సంచలనం సృష్టిస్తోంది. అల్లు అర్జున్ గతంలో నటించిన జొమాటో, ర్యాపిడో ప్రకటనల్లో కూడా విమర్శలు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా కేసు నమోదు కావడంతో అల్లు అర్జున్ కు వాణిజ్య ప్రకటనలు కలిసి రావడం లేదనే వాదన కూడా వస్తోంది.
Also Read:Balakrishna- Sridevi: శ్రీదేవితో బాలయ్య ఎందుకు జతకట్టలేదు.. సీనియర్ ఎన్టీఆర్ మాట తీసుకున్నాడా?