Balakrishna- Sridevi: అతిలోక సుందరి శ్రీదేవి మూడు తరాల టాప్ స్టార్స్ తో నటించారు. మొదటి తరం హీరోలు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఆ నెక్స్ట్ జనరేషన్ స్టార్స్ కృష్ణ, శోభన్ బాబు లతో నటించిన శ్రీదేవి, మూడో తరం స్టార్స్ చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో జతకట్టారు. ఒక్క బాలకృష్ణతో మాత్రం శ్రీదేవి నటించలేదు. దీని వెనుక పెద్ద కారణమే ఉందన్న ప్రచారం చాలా కాలంగా జరుగుతుంది. తండ్రి ఎన్టీఆర్ కోరిక మేరకు బాలకృష్ణ శ్రీదేవితో నటించకూడదని నిర్ణయించుకున్నారట.

బాలనటిగా ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి.. ఎన్టీఆర్ కి మనవరాలిగా నటించారు. బడిపంతులు చిత్రంలో శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్. ఎన్టీఆర్ వృద్ధుడైన స్కూల్ టీచర్ పాత్రలో కనిపిస్తారు. కన్న బిడ్డల నిరాదరణకు గురైన వృద్ధ దంపతులుగా ఎన్టీఆర్, అంజలీదేవి నటించారు. అప్పటికే పలు చిత్రాల్లో బాలనటిగా చేసిన శ్రీదేవి… బడిపంతులు చిత్రంలో అద్భుతంగా నటించింది. ఇక పెరిగి పెద్దయ్యాక శ్రీదేవి ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా పలు బ్లాక్ బస్టర్స్ లో నటించారు.
వీరి కాంబినేషన్ లో వచ్చిన కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, వేటగాడు, గజదొంగ భారీ కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి. ఎన్టీఆర్-శ్రీదేవి జంట హిట్ ఫెయిర్ గా తెలుగు తెరపై నిలిచిపోయింది. ఇక 90లలో స్టార్స్ గా అవతరించి చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ శ్రీదేవితో జతకట్టారు. బాలయ్య మాత్రం నటించలేదు.

ఎన్టీఆర్ కోరిక మేరకే బాలకృష్ణ శ్రీదేవితో చిత్రాలు చేయలేదట. తన సినిమాల్లో హీరోయిన్ గా ఆమెను తీసుకోలేదట. తన పక్కన జోడీ కట్టిన శ్రీదేవితో నీవు సినిమాలు చేస్తే ప్రేక్షకులు సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవచ్చు, అలాగే నా ప్రక్కన నటించిన ఆమె నీకు తల్లితో సమానం, కాబట్టి శ్రీదేవితో రొమాన్స్ చేయొద్దని ఎన్టీఆర్ బాలయ్యను ఆదేశించారట. అందుకే బాలకృష్ణ శ్రీదేవితో సినిమాలు చేయలేదట. ఆ మాట కొస్తే నాగార్జున కూడా చేయకూడదు. ఎన్టీఆర్ కి మించి శ్రీదేవితో ఏఎన్నార్ ఎక్కువ చిత్రాలు చేశారు. శ్రీదేవి, ఏఎన్నార్ కాంబినేషన్ లో ఆల్ టైం లవ్ ఎంటర్టైనర్స్ వచ్చాయి.
చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ఈ న్యూస్ లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారం అయ్యింది. చిరంజీవి-శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేకవీరుడు అతిలోక సుందరి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. వెంకటేష్ తో ఆమె జతకట్టిన క్షణ క్షణం క్లాసిక్ గా నిలిచిపోయింది. నాగార్జునతో గోవిందా గోవిందా, ఆఖరి పోరాటం చిత్రాల్లో శ్రీదేవి నటించారు. అలాగే వీరి కాంబినేషన్ లో రెండు హిందీ చిత్రాలు తెరకెక్కాయి.
Also Read:Pawan Kalyan : అన్నపూర్ణ లాంటి ఆంధ్రాను క్రాప్ హాలీడే చేసిన పాపం వైసీపీదే : పవన్ కళ్యాణ్
[…] Also Read: Balakrishna- Sridevi: శ్రీదేవితో బాలయ్య ఎందుకు జతక… […]
[…] Also Read:Balakrishna- Sridevi: శ్రీదేవితో బాలయ్య ఎందుకు జతక… […]
[…] Also Read: Balakrishna- Sridevi: శ్రీదేవితో బాలయ్య ఎందుకు జతక… […]