Flight Ticket : సాధారణంగా ప్రయాణాలు అనేవి ప్రతీ ఒక్కరూ చేస్తుంటారు. దగ్గర అయితే బస్సు లేదా ట్రైన్‌కి వెళ్తుంటారు. కానీ దూరం అయితే కొందరు ఫ్లైట్‌కి వెళ్తారు. ముఖ్యంగా ఇతర దేశాలకు వెళ్లేటప్పుడు తప్పకుండా కూడా విమాన ప్రయాణాలు చేస్తుంటారు. ప్రస్తుతం వీటి ధరలు కూడా చౌకగా మారాయి. సీజన్ బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు వస్తున్నాయి. అయితే చాలా మంది మూడు నెలల ముందే టికెట్లు బుక్ చేసుకుంటారు. ఎందుకంటే విమాన టికెట్లు ఇలా చేసుకోవడం వల్ల ధరలు తగ్గుతాయి. టికెట్ రేట్లు తగ్గినప్పుడే బుక్ చేసుకోవాలనే ఉద్దేశంతో కొందరు తొందరగా బుక్ చేస్తారు. ఈ సయమంలో ఒక్కోసారి పేర్లు తప్పు కొడుతుంటారు. ఫ్లైట్‌లో వెళ్లేటప్పుడు చెకిన్ చేసే ముందు వెరిఫై కూడా చేస్తారు. అలాంటి సమయంలో ఇబ్బంది వస్తుందని చాలా మంది భయపడుతుంటారు. అయితే విమాన టికెట్‌పై పేరు, ఇంటి పేరు తప్పుగా ఉంటే సరిదిద్దుకోవడం ఎలాగో ఈ స్టోరీలో చూద్దాం.
ట్రాన్స్‌పోర్టేషన్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం అయితే విమాన టికెట్‌లో ఏ పేరు ఉంటే ప్రభుత్వం జారీ చేసిన దాంట్లో అదే పేరు ఉండాలి. ఏమాత్రం తప్పుగా ఉంటే మాత్రం ప్రయాణం ఆపేసే ప్రమాదం ఉంది. ఇలాంటి సమయంలో ప్రయాణికులు కూడా ఎంతో ఇబ్బంది పడతారు. వారిని ఇబ్బంది పెట్టకుండా విమాన టికెట్‌లోని పేరు మార్చాలంటే కొన్ని రూల్స్ పాటించాలి. మొదటిగా ఎయిర్‌లైన్‌ను సంప్రదించాలి. కస్టమర్ కేర్ నంబర్‌కి కాల్ చేసి మీ విషయాన్ని తెలియజేయాలి. బుకింగ్ ఐడీ లేదా నంబర్‌తో విమాన టికెట్‌లో పేరుకు తప్పుగా పడిందని, దిద్దుబాటు చేసుకోవాలని తెలియజేయండి. కంప్లైట్ చేసే ముందు మీరు టికెట్‌ను చూపించండి. ఇలా చూపించే సమయంలో కొన్ని విమానయాన సంస్థలు ఎలాంటి రుసుము లేకుండా విమన టికెట్‌పై ఉన్న తప్పు పేరును మారుస్తుంది. కొన్ని విమానయాన సంస్థలు అధిక రుసుము తీసుకుంటారు. అలాగే కొన్ని పత్రాలు కూడా అడుగుతారు. మీరు కారణం వల్ల పేరు మార్చాలి అనుకుంటున్నారో.. దానికి సంబంధించిన పత్రాలను సమర్పించాలి. ఉదాహరణకు చట్టపరమైన సమస్యలు, వివాహం, విడాకులు లేదా మరేదైనా కారణాల వల్ల మారిస్తే.. వాటికి సంబంధించిన వాటిని మీరు సమర్పించాలి. ఇలా పేరును సరిదిద్దుకున్న తర్వాత కొన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు రుసుము వసూలు చేస్తాయి. దీన్ని బట్టి మళ్లీ టికెట్ ధర మారే అవకాశం ఉంది. ఇలా మీరు పేరును ఈజీగా సరిదిద్దు కోవచ్చు. చాలా మంది అవసరం లేదని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్రయాణ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి గుర్తింపు కార్డుపై ఏ పేరు ఉంటే.. అదే పేరును టికెట్‌పై నమోదు చేసుకోవడం ఉత్తమం.