Game Changer OTT: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. అంత పెద్ద మాస్ హీరో ని డైరెక్టర్ తన చేతుల్లో పెట్టుకొని, ఒక్కటంటే ఒక్క భారీ యాక్షన్ సన్నివేశం లేకుండా చాల సాదాసీదాగా ఈ చిత్రాన్ని తీశాడనీ, ఇంతటి మామూలు పొలిటికల్ ఎంటర్టైనర్ సినిమాకి మూడేళ్ళ సమయం, 400 కోట్ల రూపాయిల బడ్జెట్ ని ఖర్చు చేయడం హాస్యాస్పదమని, సినిమాలో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా గుర్తించుకోదగినట్టు లేదని తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇంతటి ఘోరమైన ఫ్లాప్ టాక్ రావడంతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ అత్యధిక శాతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఎగబడడంతో ‘గేమ్ చేంజర్’ ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఫలితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఫుల్ రన్ లో కేవలం 200 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.
అయితే థియేటర్స్ లో సరిగా ఆడని సినిమాలు ఓటీటీ లో కూడా ఫ్లాప్ అవుతాయని అనుకుంటే పొరపాటే. ఎన్నో ఫ్లాప్ సినిమాలు ఓటీటీ లో సూపర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అదే విధంగా థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన కొన్ని సినిమాలు ఓటీటీ లో మాత్రం ఫ్లాప్ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి కూడా ఓటీటీ లో బంపర్ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ కచ్చితంగా రామ్ చరణ్ రేంజ్ కి తగ్గ సినిమా కాదు, కానీ కంటెంట్ పరంగా చూస్తే మరీ అంత చెత్త సినిమా కూడా కాదు. అవలీలగా ఒకసారి చూసేయొచ్చు. కాబట్టి ఈ సినిమా ఓటీటీ లో సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విడుదలకు ముందు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ సంస్థ 150 రూపాయలకు కొనుగోలు చేసింది.
ఈ నెల 7వ తారీఖు నుండి ‘గేమ్ చేంజర్’ చిత్రం అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి రానుందని, తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి రానుంది అని అమెజాన్ ప్రైమ్ సంస్థ కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేసింది. ఓటీటీ లోకి అయితే మరో మూడు రోజుల్లో వస్తుంది కానీ, సినిమాకి సంబంధించిన HD ప్రింట్ సోషల్ మీడియా లో లీకై చాలా రోజులే అయ్యింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను నెటిజెన్స్ సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం వంటివి కూడా జరిగాయి. దాదాపుగా అనేక మంది ఈ చిత్రాన్ని సోషల్ మీడియా లోనే చూసేసారు. అయినప్పటికీ ఓటీటీ లో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. ఓటీటీ వెర్షన్ లో ల్యాగ్ గా అనిపించిన కొన్ని సన్నివేశాలను తొలగించారట.