KTM 390 Adventure vs Royal Enfield Himalayan 450: ప్రస్తుతం మార్కెట్ లో KTM, రాయల్ ఎన్ఫీల్డ్ ద్విచక్ర వాహనాలకు అత్యధిక క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ బ్రాండ్ల బైకులపై యువతలో ఎక్కవ డిమాండ్ ఉంటుంది. దీంతో ఈ బైక్ పొందాలంటే కొన్ని వారాల పాటు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇటీవల KTM తన 2025 390 అడ్వెంచర్ స్పెసిఫికేషన్లను వెల్లడించింది. దాంతో రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450తో ఈ రెండు బైకులలో ఏది బెస్ట్ అన్న సందేహాలు కొనుగోలుదారులలో తలెత్తుతుంది. ఈ రెండు బైకులలో ఏది మరింత పవర్ ఫఉల్, అదనపు ఫీచర్లు కలిగి ఉంది.. ఏది బెస్ట్ రైడింగ్ అందిస్తుందో తెలుసుకుందాం.
ఇంజిన్, పవర్
2025 KTM 390 అడ్వెంచర్‌లో ఒక 399cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 46 హెచ్‌పి శక్తిని, 39Nm టార్కును 6,500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ వాహనంలో పవర్-టూ-వెయిట్ రేషియో 251.36 hp/టన్ ఉంటుంది. ఇక, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో 452cc సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉండగా, అది 40 హెచ్‌పి శక్తిని, 40Nm టార్కును 5,500 rpm వద్ద ఉత్పత్తి చేస్తుంది. హిమాలయన్ 450లో పవర్-టూ-వెయిట్ రేషియో 201.02 hp/టన్ ఉంటుంది.
బరువు, కొలతలు
KTM 390 అడ్వెంచర్‌లో 830mm సీట్ హైట్, 227mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,471mm వీల్బేస్, 14.5 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 183kg బరువు ఉంటుంది. మరోవైపు, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450లో సీట్ హైట్ 825mm-845mm (అడ్జస్టబుల్), 230mm గ్రౌండ్ క్లియరెన్స్, 1,510mm వీల్బేస్, 17 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్, 196kg బరువు ఉంటుంది.
సస్పెన్షన్ , బ్రేక్స్
ఈ రెండు బైకులలో కూడా ఒకే విధమైన సస్పెన్షన్ సెటప్ ఉంటుంది. ఇందులో USD ఫోర్క్, మోనోషాక్ ఉన్నాయి. బ్రేక్స్ పరంగా, హిమాలయన్ ఫ్రంట్ డిస్క్ కొంచెం పెద్దది (330mm) కాగా, KTM 390 అడ్వెంచర్‌లో 320mm డిస్క్ ఉంటుంది. సస్పెన్షన్ ట్రావెల్ లో KTMకు మరింత వెనుక భాగం ఉంది. అదనంగా, KTM 390 అడ్వెంచర్‌లో 5-అంగుళాల రంగీన TFT డిస్‌ప్లే, క్రూయిజ్ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. హిమాలయన్ 450లో 4-అంగుళాల డిస్‌ప్లే, గూగుల్ మ్యాప్స్ చూపించే ఫీచర్ ఉంది.
ధర
2025 KTM 390 అడ్వెంచర్ ధర ప్రస్తుతం వెల్లడించలేదు. అయితే, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 ధర 2.85-2.98 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు. గత KTM 390 అడ్వెంచర్ మోడల్ ధర 2.8 లక్షల (ఎక్స్-షోరూమ్) చొప్పున ఉండేది.
KTM 390 అడ్వెంచర్, రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 మధ్య పోటీ తీవ్రమైంది. ఇంజిన్ శక్తి, బరువు, సస్పెన్షన్ వంటి అంశాలు రెండూ పవర్ ఫుల్ పర్ఫామెన్స్ అందజేస్తాయి. KTM 390 అడ్వెంచర్ ట్రాక్టిబిలిటీ, అదనపు ఫీచర్ల పరంగా బెస్ట్ అని చెప్పవచ్చు. కొత్త కొనుగోలు చేయాలన్న ఆసక్తి ఉన్నవారికి ఇది అనుకూలంగా ఉండవచ్చు. అయితే, హిమాలయన్ 450 భద్రత, బలమైన ఫీచర్లు ఇతర ప్రయోజనాలను అందిస్తాయి.