https://oktelugu.com/

Rythu Runa Mafi 2023: అసలు రుణమెంత.. కేసీఆర్ మాఫీ చేసిందెంత..?

సెప్టెంబర్‌ నెల రెండో వారం వరకు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఈమేరకు విడతల వారీగా రుణాలు మాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు. హఠాత్తుగా సోమవారం.. రుణమాఫీ పూర్తయిపోయిందని ప్రకటించారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : August 16, 2023 / 10:32 AM IST

    Rythu Runa Mafi 2023

    Follow us on

    Rythu Runa Mafi 2023: ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ 2018లో మళ్లీ అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకు పంట రుణామా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఈమేరకు మ్యానిఫెస్టోలోనూ చేర్చారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన రుణమాఫీ హామీని ఈ ఎన్నికలకు ముందు పూర్తి చేయాలని కేసీఆర్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు. వరుసగా భూములు వేలం వేసి.. మద్యం దుకాణాలకు ముందుగానే టెండర్లు పిలిచి వచ్చిన డబ్బులతో పంట రుణాలు మాఫీ చేస్తున్నారు.

    సెప్టెంబర్‌ రెండో వారం వరకు గడువు..
    సెప్టెంబర్‌ నెల రెండో వారం వరకు పంట రుణాలన్నీ మాఫీ చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. ఈమేరకు విడతల వారీగా రుణాలు మాఫీ చేయాలని అధికారులను ఆదేశించారు. హఠాత్తుగా సోమవారం.. రుణమాఫీ పూర్తయిపోయిందని ప్రకటించారు. రూ.లక్షలోపు రుణాలను సోమవారం ఒకే రోజు 10,79,721 మంది రైతుల రూ.6,546,05 కోట్ల రుణాలను మాఫీ చేశామని ప్రకటించేసింది. నిజానికి రుణమాఫీ అమలు ప్రకటన చేసినప్పుడు రూ.18,241 కోట్లకు ఆర్థికశాఖ బడ్జెట్‌ రిలీజ్‌ ఆర్డర్‌ విడుదల చేసింది. వెంటనే మూడో తేదీన రూ.37 వేల నుంచి రూ.41 వేల మధ్య ఉన్న రుణాలు 62,758 మంది రైతులకు మాఫీ చేస్తూ రూ.237.85 కోట్లు జమ చేసింది. రెండో విడతలో 5,86,270 మందికి రూ.1374.96 కోట్లు మాఫీ అయ్యాయి. ఇంకా 25.98 లక్షల మంది రైతులకు రూ.18,004 కోట్లు అందాల్సి ఉందని లెక్క చెప్పింది. వీటిని అయిదు విడతల్లో విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతూ వచ్చింది. ఇప్పుడు మాత్రం రుణమాఫీ పూర్తి అయిందని ప్రకటించింది.

    రైతుల్లో గందరగోళం..
    ప్రభుత్వ ప్రకటనతో లక్ష రూపాయల రుణాలు తీసుకున్న వారి పరిస్థితి గందరగోళంగా ఉంది. చాలా మంది రైతులకు రుణం ఇంకా మాఫీ కాలేదు. కానీ ప్రభుత్వం హడావుడిగా పూర్తయినట్లు ప్రకటించింది. పూర్తి మాఫీకి మరో రూ.10 వేల కోట్లు కావాలి. కానీ కేసీఆర్‌ మాఫీ పూర్తయిందని ప్రకటించడంతో మాఫీ కాని వారికి ఇక అంతే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంకా చాలా పథకాలకు నిధులుకేటాయించాల్సి ఉంది. దీంతో రుణామఫీ భారాన్ని తగ్గించుకుందా.. మిగిలిన వారికీ ఇస్తుందా అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అనధికారికంగా మాత్రం బీఆర్‌ఎస్‌ పార్టీ రుణమాఫీ పూర్తి అయిపోయిందని చెబుతోంది.