Samantha: ఒక ప్రక్క అనార్యోగంతో యుద్ధం చేస్తూనే సమంత ప్రొఫెషన్ కొనసాగిస్తోంది. ఆరు నెలల వ్యవధిలో సిటాడెల్ వెబ్ సిరీస్ కంప్లీట్ చేసింది. అలాగే ఖుషి మూవీ పెండింగ్ షూట్ కూడా ముగించింది. ఖుషి విడుదలకు సిద్ధమవుతుంది. సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీగా విడుదల చేస్తున్నారు. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు.
ఈ ఈవెంట్లో సమంత, విజయ్ దేవరకొండ సందడి చేశారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడారు. తన అనారోగ్యం కారణంగా ఖుషి షూటింగ్ మధ్యలో ఆగింది. అయినా నిర్మాతలు అర్థం చేసుకుని సహకారం అందించారు, అన్నారు. అలాగే మీ అందరి అశీసులతో తిరిగి కోలుకుంటాను . పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానని సమంత వెల్లడించారు. సమంత మయోసైటిస్ చికిత్స కోసం అమెరికా వెళ్లనున్నట్లు సమాచారం. అక్కడ కొన్ని రోజులు ఉందనున్న సమంత… ఏడాది పాటు సినిమాలకు దూరం కానున్నారట.
ఇదిలా ఉంటే ఖుషి ప్రమోషన్స్ కోసం సమంత సూపర్ గ్లామరస్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్ డిజైనర్ డ్రెస్ లో హాట్ గా దర్శనమిచ్చింది. కొన్నాళ్లుగా సమంత ఈ తరహా ఫోటో షూట్స్ చేయడం లేదు. కేవలం ఖుషి చిత్ర ప్రమోషన్స్ కోసం ఇలా ఫ్యాషన్ ఐకాన్ గా అవతరిస్తుంది. సమంత లేటెస్ట్ ఫోటో షూట్ చూసిన ఫ్యాన్స్… ఒకప్పటి సమంత గుర్తుకు వచ్చింది అంటున్నారు. సమంత గ్లామరస్ లుక్ వైరల్ అవుతుంది.
సమంత నటించిన మరో ప్రాజెక్ట్ సిటాడెల్. ఇది ఇంటర్నేషనల్ యాక్షన్ సిరీస్. ఇండియన్ వెర్షన్ లో సమంత నటించింది. వరుణ్ ధావన్ మరో ప్రధాన పాత్ర చేశాడు. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న సిటాడెల్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.