ABN RK Vs Jagan: మీడియాలో.. ఎల్లో మీడియా తీరే వేరు. నిద్ధరలేస్తే గిట్టని ప్రభుత్వాలు, పార్టీలపై విష ప్రచారానికి దిగడం ఈ మీడియాకు వెన్నతో పెట్టిన విద్య. ప్రజలను రెచ్చగొట్టే రాతలతో పబ్బం గడుపుకోవాలన్న యావలో వాస్తవాలకే మసి పూస్తుంటాయి. టీడీపీకి, చంద్రబాబుకు, కమ్మ సామాజికవర్గానికి ఇంపైన వార్తలతోనే కప్పేస్తుంటాయి.సొంత సామాజికవర్గాన్ని పైకిలేపడం.. ఇతర సామాజికవర్గాల వారిని నొక్కి పాతరేయడం ఈ యాజమాన్యాలకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దశాబ్దాలుగా మీడియా ముసుగులో ‘ఎల్లో’ గుత్తాధిపత్యం కొనసాగుతునే ఉంది.
అయితే ఎన్నిరకాల విష ప్రచారాలు చేసినా అధిగమించారు ఏపీ సీఎం జగన్. ఎల్లో మీడియా వ్యూహాలకు మించి బుర్రకు పదును పెడుతున్నారు. చివరకు వారు రాసే విషపు రాతలను.. పూలజల్లుగా మార్చుకుంటున్నారు. అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలన్నది జగన్ ప్లాన్. మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు అందులో భాగంగానే. అయితే అడుగడుగునా ఎల్లో మీడియా అడ్డుతగులుతోంది. తమ రాతలతో ప్రజల్లో జగన్ ను పలుచన చేయ్యాలని చూసింది. కానీ అవే రాతలను తనకు అనుకూలంగా మార్చుకున్న నేర్పరి, టెంపరితనం జగన్ ది.
అమరావతి రాజధాని నిర్మాణాకి రూ.4.50 లక్షల కోట్లు అవసరమని నాడు చంద్రబాబు ప్రకటించారు. తాత్కాలికంగా రూ.1.50 లక్షల కోట్లు ఖర్చుపెడితే చాలూ అమరావతి తనంతట తానే ఆదాయం తెచ్చుకుంటుందని నాడు చంద్రబాబు ప్రకటించారు. ఎల్లో మీడియా అప్పట్లో దీనినే హైలెట్ చేసింది. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత ఆ రాతలనే ఆధారంగా చేసుకున్నారు జగన్. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అంత ఖర్చు భరించే స్థితిలో లేదని ప్రకటించారు. ఇప్పటికే అభివృద్ధి చెందిన విశాఖను రాజధానిగా చేస్తామని చెప్పుకొచ్చారు.
అయితే ఇప్పుడు కూడా అటువంటి రాతలతోనే ఆంధ్రజ్యోతి పాటు ఎల్లో మీడియా జగన్ కు ఎంతో మేలు చేస్తున్నాయి. తాజాగా సీఆర్డీఏకు బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదని ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం ప్రచురించింది. అసలు బ్యాంకులే రుణాలు ఇవ్వకుంటే తాను అమరాతిని ఎలా కట్టగలనన్న జగన్ వాదనకు సమర్థిస్తూ కథనం రాసినట్టుంది. ఇంతకు ముందు అమరావతి భూముల వేలం సమయంలో సైతం… కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. అప్పట్లో కూడా అదే వార్తను హైలెట్ చేసింది. జగన్ వైఫల్యాలను చెప్పే క్రమంలో రాతలు రాసినా.. ఆ వార్తలతోనే న్యాయస్థానంలో ఉపశమనం పొందే విధంగా .. జగన్ తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఎల్లో మీడియా తెలియకుండానే ఇలా జగన్ ట్రాప్ లో పడుతుండడం విశేషం.
ఆంధ్రజ్యోతి విషపు రాతలు టీడీపీ శ్రేణులకు ఇంపుగా కనిపిస్తుంటాయి. కానీ దాని ఇంపాక్ట్ మాత్రం మరింత వరస్ట్ గా ఉంటుందని కొందరు సీనియర్లకు మాత్రమే తెలుసు. అయితే వారి మాట చెల్లుబాటు కాని దుస్థితి. తెలుగు నాట చంద్రబాబు స్థాపించిన టీడీపీ అనుకూల మీడియా బలంగా ఉంది. విచ్చలవిడిగా అది బట్టలిప్పి రెచ్చిపోతూనే ఉంటుంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 లాంటి బలమైన టీడీపీ మీడియా ధాటికి వైసీపీ, జగన్ కూడా నిలవలేకపోతోందన్న భ్రమల్లోనే టీడీపీ ఉంది. కానీ అది అంతిమంగా పార్టీకి నష్టం చేస్తోందని టీడీపీ శ్రేణులు ఊహించలేకపోతున్నాయి.