https://oktelugu.com/

Anirudh Love Jonita Gandhi: స్టార్ సింగర్ తో అనిరుధ్ ఎఫైర్? ఎక్కడ చూసినా వీరిద్దరే!

2016లో సుచి లీక్స్ సంచలనం రేపాయి. సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ లో సుచి లీక్స్ పేరుతో స్టార్స్ ప్రైవేట్ ఫోటోలు విడుదల చేసింది. అప్పుడు అనిరుధ్ సైతం బుక్ అయ్యాడు. నటి ఆండ్రియా జెర్మియాను ఘాటైన లిప్ కిస్ చేస్తున్న ఫోటో లీకైంది. అనంతరం సుచిత్ర హీరో ధనుష్, అనిరుధ్ పై లైంగిక ఆరోపణలు చేశారు. తనకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె సీరియస్ అలిగేషన్స్ చేశారు.

Written By:
  • Shiva
  • , Updated On : July 11, 2023 / 08:47 AM IST

    Anirudh Love Jonita Gandhi

    Follow us on

    Anirudh Love Jonita Gandhi: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ అవతరించారు. ఏ ఆర్ రెహమాన్, ఇళయరాజా, హరీష్ జయరాజ్ వంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ని వెనక్కి నెట్టి రేసులో ముందుకు దూసుకు వచ్చాడు. సౌత్ ఇండియాలో భారీ చిత్రాలకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. 20 ఏళ్ల వయసులో పరిశ్రమలో అడుగుపెట్టిన అనిరుధ్ తన మార్క్ క్రియేట్ చేశాడు. టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అనిరుధ్ జీవితంలో మాత్రం చాలా వివాదాలే ఉన్నాయి.

    2016లో సుచి లీక్స్ సంచలనం రేపాయి. సింగర్ సుచిత్ర తన ట్విట్టర్ అకౌంట్ లో సుచి లీక్స్ పేరుతో స్టార్స్ ప్రైవేట్ ఫోటోలు విడుదల చేసింది. అప్పుడు అనిరుధ్ సైతం బుక్ అయ్యాడు. నటి ఆండ్రియా జెర్మియాను ఘాటైన లిప్ కిస్ చేస్తున్న ఫోటో లీకైంది. అనంతరం సుచిత్ర హీరో ధనుష్, అనిరుధ్ పై లైంగిక ఆరోపణలు చేశారు. తనకు మత్తు మందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె సీరియస్ అలిగేషన్స్ చేశారు.

    అనంతరం పలువురు హీరోయిన్స్ తో ధనుష్ ఎఫైర్ పెట్టుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఆయన సింగర్ జోనితా గాంధీతో డేటింగ్ చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది. వీరిద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్న క్రమంలో ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లి అంటున్నారు. విక్రమ్ మూవీ సమయంలో వీరి ప్రేమకు బీజం పడిందట.తరచుగా కలుస్తూ, విహరిస్తూ ప్రేమలో మునిగి తేలుతున్నారట.

    బీస్ట్ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఆ మూవీలో అరబిక్ కుత్తు సాంగ్ విపరీతంగా పాప్యులర్ అయ్యింది. ఈ సాంగ్ ని జోనితా గాంధీ, అనిరుధ్ కలిసి పాడారు. వీరి లవ్ స్టోరీ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఉంది. ఇక గతంలో అనిరుధ్ అజ్ఞాతవాసి చిత్రానికి మ్యూజిక్ అందించారు. ప్రస్తుతం ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర చిత్రానికి మ్యూజిక్ ఇస్తున్నారు. జవాన్ మూవీతో బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టాడు.