ఆంధ్రప్రదేశ్ లో స్థానిక స్థానిక ఎన్నికలపై రగడ సాగుతూనే ఉంది. తాజాగా స్థానిక ఎన్నికల నిర్వహణపై స్టే ఇవ్వడం కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఫిబ్రవరిలో జరగాల్సిన స్థానిక ఎన్నికలపై స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరగా అందుకు నిరాకరించింది. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఎస్ఈసీని ఆదేశించలేమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన కౌంటర్ ను దాఖలు చేయాలని ఎలక్షన్ కమిషనర్కు సూచించింది. గత కొన్ని రోజులుగా ఎలక్షన్ కమిషనర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా సాగుతోంది. కరోనా వైరస్ పూర్తిగా అదుపులోకి రాలేదని, దీంతో ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించొద్దని ప్రభుత్వం వాదిస్తోంది. కానీ దేశంలో వివిధ చోట్ల కోవిడ్ నిబంధనలతో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, ఏపీలోనూ నిబంధనలను అనుసరించి స్థానిక ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఎలక్షన్ కమిషనర్ పేర్కొంటున్నారు. దీంతో ఈ పంచాయితీ కోర్టుకు వెళ్లింది.తాజాగా కోర్టు ఎలక్షన్ కమిషన్ కే అనుకూలంగా తీర్పునిచ్చింది.