
కొంత మంది మాటలు చెబితే పడతారు.. మరికొందరు డబ్బు ఆశచూపితే పడతారు.. అయితే.. వీటన్నింటికన్నా పవర్ ఫుల్ వెపన్ అమ్మాయి. ఈ బుల్లెట్ కు చిత్తవని మగాళ్లు రేర్. సరైన రీతిలో ప్రయోగించాలేగానీ.. ఎవరి వికెట్ అయినా పడాల్సిందే. ఆ విధంగా హనీ ట్రాప్ ను రంగంలోకి దించిన కేటుగాళ్లు.. బాలీవుడ్ ను టార్గెట్ చేశారు. ఒకరిద్దరు కాదు.. ఏకంగా వంద మందిని హనీ ట్రాప్ ద్వారా బోల్తా కొట్టించి, వారి నగ్న వీడియోలు కూడా సంపాదించారు. ఇప్పుడీ వ్యవహారం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ తరహా మోసాలు భారీగా పెరిగిపోయాయి. ప్రముఖులను, డబ్బున్న వాళ్లను చూస్తారు. వారితో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్ షిప్ చేస్తారు. నమ్మకం కుదిరేంత వరకూ చాలా బుద్ధిగా నటిస్తారు. పైగా అమ్మాయి.. ఇంకేముందీ? అవతలివాళ్లు పడిపోవాల్సిందే. ఆ రేంజ్ లో మాట కలుపుతారు. ఆ తర్వాత నెక్స్ట్ టార్గెట్ మొదలు పెడతారు. మెల్ల మెల్లగా శృంగారంలోకి దింపుతారు.
శృంగారంలోకి దింపడం అంటే.. డైరెక్టుగా ఏమీ ఉండదక్కడ. కవ్విస్తారు.. నవ్విస్తారు.. ఆ తర్వాత విషయం ‘బ్లూ టర్న్’ తీసుకుంటుంది. అంటే.. నీలి చిత్రాలు పంపించడం మొదలు పెడతారు. అమ్మాయే ఆ పని చేసినప్పుడు.. ఈ మొనగాళ్లు ఎందుకు ఆగుతారు? తాము ఎంత పోటుగాళ్లో చూపించడానికి ప్రయత్నిస్తారు.
ఎప్పుడైతే లైన్లో పడ్డారని భావిస్తుందో.. అవతలి కిలేడీ వెంటనే బట్టలు విప్పేసే కార్యక్రమం మొదలు పెడుతుంది. అంటే.. న్యూడ్ గా వీడియో కాల్ చేస్తుంది. ఆ మైకంలో ఇతగాడు కూడా విప్పేస్తాడు. విప్పేలా చేస్తుంది. ఎప్పుడైతే బట్టలు విప్పేశాడో.. అప్పుడే దొరికిపోయినట్టు లెక్క. అవతలి నుంచి ఈ వీడియో మొత్తం రికార్డు చేసేస్తుంది. ఆ తర్వాత ఇంకేముందీ? అడిగినంత డబ్బులు పంపించాలని డిమాండ్ చేస్తుంది. లేకపోతే.. నీ బేర్ బాడీ సినిమా.. నెక్స్ట్ మినిట్ లో ఆన్ లైన్లో రిలీజ్ అయిపోతుందని భయపెట్టింది. అలా మొదలైన పేమెంట్ కు హద్దూ పద్దూ ఉండదు. జేబు గుల్ల చేసుకునేదాకా గుంజుడు ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది.
ఇప్పుడు.. బాలీవుడ్ లో ఇలాంటి బాధితులు ఏకంగా వంద మంది వరకు ఉన్నారట. ముంబై సైబర్ క్రైమ్ కు వెల్లువలా ఫిర్యాదులు వచ్చి పడుతున్నాయి. వీరిలో టాప్ సెలబ్రిటీస్ కూడా ఉన్నారన్న విషయం కలకలం రేపుతోంది. ఇంకా మోడల్స్, రిచ్ మెన్, ఉమెన్ అందరూ ఉన్నారట. పలు ఫిర్యాదలు అందుకున్న పోలీసులు.. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి ఏకంగా 285 మందికి సంబంధించిన నగ్న వీడియోలను కూడా స్వాధీనం చేసుకున్నారు.