
కరోనా కారణంగా అర్థాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021ను పట్టాలెక్కించేందుకు బీసీసీఐ రెడీ అయ్యింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రెండో అంచె పోటీలను యూఏఈ వేదికగా నిర్వహిస్తోంది. మరో నెలరోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది.
ఈ క్రమంలోనే ఐపీఎల్ కు ఊపు తెచ్చేందుకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో ఓ ప్రమోషనల్ వీడియోను రూపొందించారు. అందులో ధోని పాటతో స్టెప్పులతో అదరగొట్టేశాడు.
‘అసలు సినిమా ఇంకా మిగిలే ఉంది’ అని పేర్కొంటూ ఓ బాలీవుడ్ సినిమా డైలాగ్ తో కూడిన ఈ ప్రమోషన్ వీడియోలో ధోని జుట్టుకు ఎర్రరంగు వేసుకొని వినూత్న అవతారంలో కనువిందు చేశాడు.
ఐపీఎల్ నిర్వాహకులు కొద్దిసేపటి క్రితమే ఆ వీడియోను విడుదల చేయగా వైరల్ గా మారింది. సెప్టెంబర్ లో ప్రారంభమయ్యే మిగిలిన ఐపీఎల్ 14వ సీజన్ మరింత రక్తి కడుతుందంటూ రోహిత్, కోహ్లీ, గబ్బర్ శిఖర్ ధావన్ సహా పలువురు క్రికెటర్లను ధోని తలుచుకుంటూ సాగిన ఈ వీడియో ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. ఈ సారి డ్రామా, సస్సెన్స్ , క్లైమాక్స్, సూపర్ ఓవర్లతోపాటు హెలికాప్టర్ టేకాఫ్ కూడా ఉంటుందంటూ ధోని వీడియోలో కనువిందు చేశాడు.
ఈ ప్రచార వీడియోను చూసిన క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ధోని అభిమానులు అయితే ఈ వీడియోను తెగ షేర్లు చేస్తూ కామెంట్స్ చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఐపీఎల్ కు అసలు సిసలు ప్రమోషన్ ధోనితోనే వచ్చిందని అంటున్నారు.
🎺🎺🎺 – #VIVOIPL 2021 is BACK and ready to hit your screens once again!
Time to find out how this blockbuster season concludes, 'coz #AsliPictureAbhiBaakiHai!
Starts Sep 19 | @StarSportsIndia & @DisneyPlusHS pic.twitter.com/4D8p7nxlJL
— IndianPremierLeague (@IPL) August 20, 2021