Homeజాతీయ వార్తలుHolidays : ఈ ఏడాది అన్ని ఆదివారాలే.. ఉద్యోగుల ఏడుపు మామూలుగా లేదుగా!

Holidays : ఈ ఏడాది అన్ని ఆదివారాలే.. ఉద్యోగుల ఏడుపు మామూలుగా లేదుగా!

Holidays : సెలవులు అంటే ఉద్యోగులకే కాదు, విద్యార్థులకు కూడా ఎంతో ఇష్టం! కానీ ఏటా లిమిటెడ్‌గా వచ్చే సెలవులే వీకెండ్‌లకు పడితే మాత్రం అసలు అసంతృప్తి తథ్యం. ఇప్పుడు అదే పరిస్థితి రిపబ్లిక్ డే (జనవరి 26) విషయంలో ఎదురైంది. ఈ ఏడాది రిపబ్లిక్ డే ఆదివారం రోజుకు వచ్చింది. సాధారణంగా ఇది నేషనల్ హాలీడే అయినప్పటికీ, వీకెండ్‌కి పడిపోయిన కారణంగా ఉద్యోగులు, విద్యార్థులు ప్రత్యేక సెలవును ఆస్వాదించలేకపోతున్నారు. “సంక్రాంతి తర్వాత వచ్చే ఈ బ్రేక్ చాలా అవసరమైంది.. కానీ వారం చివరికి వచ్చేయడంతో, సెలవు అని అసలు ఫీలింగే లేదు!” అని ఐటీ ఉద్యోగులు సోషల్ మీడియాలో తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు.

ఐటీ ఉద్యోగుల ఫ్రస్ట్రేషన్
ఐటీ రంగంలో పని చేసే వారు వీకెండ్ హాలీడేస్‌ను స్మార్ట్‌గా ప్లాన్ చేసుకుని చిన్న ట్రిప్స్ ప్లాన్ చేసుకోవడం సాధారణం. అయితే, జనవరి 26 ఆదివారం రావడం వల్ల ఈసారి అదీ అసాధ్యమైంది.
“ఒకరోజు ముందు లేదా తరువాత వచ్చుంటే నాలుగో శనివారం + ఆదివారం + రిపబ్లిక్ డే కలిపి లాంగ్ వీకెండ్ వచ్చేది” అంటూ నిరాశ వ్యక్తం చేస్తున్నారు.

మార్చిలో ఉగాది కూడా ఆదివారమే!
ఈ ఏడాది ఇదే సమస్య మార్చిలో కూడా ఎదురుకానుంది. ఉగాది (తెలుగు నూతన సంవత్సర దినోత్సవం) కూడా మార్చి 31, ఆదివారానికి వస్తోంది. అంటే ఉద్యోగులకు మరో సెలవు వృధా అయ్యిందన్న మాట. “ఏంటి బాబోయ్, ఏదైనా పెద్ద సెలవు వస్తుందనుకుంటే అది వీకెండ్‌కి పడుతుందే!” అని కొందరు మిమ్స్ పోస్ట్ చేస్తున్నారు.

సెలవుల ఖాతాలో తగ్గుదల..
జనవరి 26, మార్చి 31 రెండూ వీకెండ్‌లకు వచ్చేయడంతో ఉద్యోగుల సెలవుల లెక్క తగ్గిపోతోంది. ఇకపై వచ్చే సెలవులైనా వర్కింగ్ డేస్‌లో వస్తాయా? లేకపోతే ఇవి కూడా ఇలాగే మిస్ అవుతాయా? అని ఉద్యోగులు, విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికైతే 2025 కొత్త సంవత్సరంలో జనవరిలోనే పాఠశాలలు, కళాశాలలకు చాలా సెలవులు వచ్చాయి. జనవరి నెలలో నూతన సంవత్సరం, సంక్రాంతి, గణతంత్ర దినోత్సవం వంటి అనేక సెలవులు ఉంటాయి. 2025 జనవరి నెలలో మొత్తం 31 రోజులు ఉంటే, 8 రోజులు సెలవులు ఉంటాయి. తెలంగాణ ప్రభుత్వం జనవరి 1న నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటించింది. కాబట్టి, విద్యార్థులు, ఉద్యోగులు ఆ రోజు పాఠశాలలు ,కార్యాలయాలకు వెళ్లకుండా ఎంజాయ్ చేశారు. జనవరి 13 సోమవారం భోగి పండుగ , జనవరి 14 మంగళవారం సంక్రాంతి సెలవు పండుగ ..మరుసటి రోజు, జనవరి 15న, కనుమ పండుగకు ఐచ్ఛిక సెలవు ప్రకటించారు. మునుపటి రోజు ఆదివారం.. కాబట్టి జనవరి 12 నుండి 15 వరకు వరుసగా నాలుగు రోజులు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చాయి. జనవరి 26 గణతంత్ర దినోత్సవం నాడు ప్రభుత్వ సెలవు దినం అవుతుంది.

ఆ రోజు ఆదివారం కాబట్టి దానిని సాధారణ సెలవు దినంతో కలిపి ఉంచుతారు. జనవరిలో, 5, 12, 19, 26 తేదీలు ఆదివారాలు కాబట్టి, సాధారణ సెలవు దినం ఉంటుంది. ఈ నాలుగు రోజుల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మనం ఈ విధంగా చూస్తే, జనవరిలో సెలవులు విద్యార్థులకు, ఉద్యోగులకు బాగానే కలిసొచ్చిందని చెప్పొచ్చు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper